మంచి సినిమాలు వస్తేనే కదా.. జనాలు వచ్చేది

కొవిడ్‌ కష్టాల నుంచి ఎవరూ ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఈలోగా ‘కొత్త’ కరోనా వచ్చేస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లకు ప్రజలు ఎంతవరకు వస్తారనే విషయంలో ఇంకా పూర్తి నమ్మకం కలగడం లేదు. థియేటర్లకు వెళ్లి మేం సినిమా చూస్తాం… మీరూ రండి అంటూ సినిమా జనాలు మొత్తం ట్వీట్లతో సందడి చేస్తున్నారు. ఎంతమంది వస్తారు, ఎన్ని రోజులు వస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కొత్త సినిమా కాబట్టి వస్తారు అనుకుందాం. సంక్రాంతి కాబట్టి ఆ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కానీ పాత సినిమాలు థియేటర్‌లో వేసి ఏం చేద్దామని?

ఆఁ.. మేం చెప్పది ఆ సినిమాలు గురించే. ఓటీటీలో ఇప్పటికే విడుదలైన ‘ఒరేయ్‌ బుజ్జిగా’, ‘వి’ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఈ నెల 31న రానుండగా, వచ్చే నెల 1న ‘వి’ థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ సినిమాలకు ఓటీటీల్లో పెద్దగా రెస్పాన్స్‌ ఏమీ రాలేదు. సినిమాల కొరతతో జనాలు చూశారనే టాక్‌ కూడా నెటిజన్లలో వినిపించింది. ఇప్పుడు అలాంటి సినిమాల్ని పెద్ద తెర మీద చూడటానికి ఎవరొస్తారు అనేదే ఇక్కడ చర్చ

థియేటర్లు మా చేతుల్లో ఉన్నాయి కాబట్టి కొంతమంది ఈ సినిమాల్ని విడుదల చేస్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. మామూలు రోజుల్లోనే వీకెండ్‌లోనే థియేటర్లు ఫుల్‌ అవుతున్నాయి. అదీనూ మంచి సినిమాలకే. ఇప్పుడు ఈ అరకొర సినిమాలు థియేటర్లలోకి తెస్తే యజమాలనుకు లాసే కదా. మళ్లీ మేం ఎంతో కష్టపడి సినిమాలు థియేటర్లకు తెచ్చాం… ప్రేక్షకుల నుంచి మాకు సహకారం దక్కలేదు అని నెపం జనాల మీద వేసే అవకాశమూ లేకపోలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus