వెండితెరపై మళ్లీ కలిసి నటించిన అలనాటి హిట్ పెయిర్స్

సినిమాలో హీరో, హీరోయిన్స్ గా మెప్పించిన జంటను మళ్ళీ వెండితెరపై చూడాలని అభిమానులు కోరుకుంటుంటారు. అనేక కారణాల ఆ కాంబినేషన్ సెట్ కాదు. కానీ నేటి దర్శకులు తమకి ఇష్టమైన హిట్ పెయిర్ లను తెర మీదకు తీసుకొస్తున్నారు. ఆ సినిమాలు హిట్ అవుతుండడంతో .. ఆనాటి హిట్ పెయిర్స్ ని చూపించడానికి ప్రయత్నాలు పెరిగాయి. రీసెంట్ గా వెండితెరపై మళ్లీ కలిసి నటించిన అలనాటి హిట్ పెయిర్స్ పై ఫోకస్..

అబ్బాస్ – టబు యువతీ యువకులను ఎంతగానో ఆకట్టుకున్న మూవీ ప్రేమదేశం. ఇందులో అబ్బాస్, టబు ప్రేమికులుగా నటించి విజయాన్ని అందుకున్నారు. పదేళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి “ఇదీ సంగతి” సినిమాలో కలిసి నటించారు.

బాలకృష్ణ – సిమ్రాన్ బాలకృష్ణ, సిమ్రాన్ కలిసి నటించిన సమర సింహ రెడ్డి, నరసింహ నాయుడు సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళీ వీరిద్దరూ కలిసి ఒక్క మగాడు చిత్రంలో నటించి మెప్పించారు.

చంద్ర మోహన్, రాజ్య లక్ష్మి తెలుగు క్లాసికల్ హిట్ శంకరాభరణం చిత్రంలో చంద్ర మోహన్, రాజ్య లక్ష్మి జంటగా నటించారు. పాతికేళ్ల తర్వాత అతనొక్కడే చిత్రంలో భార్య భర్తలుగా నటించి ఆకట్టుకున్నారు.

జగపతిబాబు, మధుబాల చిలక్కొట్టుడు చిత్రంలో జగపతిబాబు, మధుబాల హీరో హీరోయిన్స్ గా మహిళా ప్రేక్షుకుల మనసు దోచుకున్నారు. ఇదే జంట ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో కనిపించింది.

జగపతిబాబు, సుకన్యజగపతి బాబు కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం పెద్దరికం. ఇందులో జగపతిబాబుకి జోడీగా సుకన్య నటించింది. హిట్ తెచ్చి పెట్టింది. మళ్ళీ వీరిద్దరూ శ్రీమంతుడులో సినిమాలో నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు.

జగపతిబాబు, మీనామహిళలను విపరీతంగా ఆకట్టుకున్న “భలే పెళ్ళాం” చిత్రంలో జంటగా నటించిన జగపతిబాబు, మీనా.. కథానాయకుడులో కలిసి నటించి కన్నీరు తెప్పించారు.

వెంకటేష్, మీనావిక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చంటి ఒకటి. ఇందులో మీనా, వెంకీ కీ జోడీగా నటించింది. సూర్య వంశంలోను కలిసి నటించి హిట్ అందుకున్నారు. వీరిద్దరూ మళ్ళీ “దృశ్యం” సినిమాలో హీరో, హీరోయిన్స్ గా నటించారు. విజయం అందుకున్నారు.

మోహన్ బాబు, జయసుధ పాతికేళ్ల క్రితం గృహ ప్రవేశం సినిమాలో మోహన్ బాబు, జయసుధ హీరో హీరోయిన్స్ గా నటించారు. మళ్ళీ రెండేళ్ల క్రితం రౌడీ చిత్రంలో భార్య భర్తలుగా చేశారు.

నాగార్జున, రమ్య కృష్ణ హలో బ్రదర్స్ సినిమాలో నాగార్జున, రమ్య కృష్ణ కలిసి నటించి మాస్ ఆడియన్స్ ని కట్టిపడేసారు. ఆదే జోష్ తో సోగ్గాడే చిన్ని నాయన లో చేశారు. అప్పటికి, ఇప్పటికీ మా జంట సూపర్ అని నిరూపించుకున్నారు.

నాగార్జున, శ్రియసంతోషం సినిమాలో నాగార్జున, శ్రియ నటన అద్భుతం. మళ్ళీ వారు అదే ప్రేమను మనం సినిమాలో చూపించి ప్రేక్షుకుల మదిలో నిలిచిపోయారు.

నరేష్, అమల ఈవీవీ తెరకెక్కించిన జంబలకిడి పంబ సినిమాతో నరేష్, అమల హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ చందమామ కథలు సినిమాలో కలిసి నటించి అభినందనలు అందుకున్నారు.

రాజేంద్ర ప్రసాద్, రమ్య కృష్ణ బృందావనం సినిమాలో రాజేంద్ర ప్రసాద్, రమ్య కృష్ణ మధ్య కెమిస్ట్రీ చక్కగా పండింది. అలా మళ్ళీ మా అల్లుడు వెరీ గుడ్ సినిమాలో ఈ జంట మెప్పించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus