టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మహేష్ 25వ చిత్రం కాబట్టి ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా కలిసి నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. వేసవి కానుకగా మే 9 న విడుదల కాబోతుంది ఈ చిత్రం. మహేష్ బాబు చిత్రం కాబట్టి ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుందని అంతా భావించారు.
అయితే బడ్జెట్ తగినట్లుగా బిజినెస్ జరగడం లేదని దిల్ రాజు లాంటి నిర్మతకే చాలా కష్టంగా మారిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి దిల్ రాజు 18 కోట్లు దాకా చెప్పారట. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని మించి ఆడుతుందని , కంటెంట్ అలాంటిదని చెప్పినా బయ్యర్లు ముందడుగు వేయడానికి భయపడుతున్నారట. కేవలం 12 నుండీ 13 కోట్లు వరకే చెల్లించగలమని వారు చెబుతున్నారట. అయితే దిల్ రాజు..మాత్రం అంత తక్కువ రేటుకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదట.
ఓవర్ సీస్ లో మహేష్ చిత్రాలకి క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. అయితే ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ లాంటి చిత్రాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ‘బ్రహ్మోత్సవం’ సినిమాని 13 కోట్లకు.. ‘స్పైడర్’ చిత్రాన్ని 15 కోట్లకు కొనుగోలు చేయగా అవి భారీ నష్టాల్ని మిగిల్చాయి. ఇక ‘భరత్ అనే నేను’ చిత్రం 18 కోట్లు పెట్టి కొన్నారు. ఆ చిత్రం బాగా కలెక్ట్ చేసింది… బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు వచ్చాయి కానీ… ఆ టైములో ‘అవెంజర్స్’ చిత్రం ఉండడంతో భారీగా కలెక్ట్ చేయలేకపోయింది.
దీంతో మళ్ళీ 18 కోట్లు పెట్టాలంటే బయపడుతున్నారట. ఏదేమైనా… ఓవర్సీస్ లోనే ‘మహర్షి’ బిజినెస్ పరిస్థితి ఇలా ఉంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుందో అని ఫిలింనగర్ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహేష్ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లను రాబట్టలేవు. కానీ సమ్మర్ సీజన్.. అలాగే దిల్ రాజు లాంటి ఓ పెద్ద నిర్మాత, ఈ సంవత్సరంలో వచ్చే రెండో పెద్ద సినిమా.. ఈ అడ్వాంటేజ్లతోనైనా ‘మహర్షి’ భారీ వసూళ్ళు సాదిస్తుందేమో చూడాలి.