ఓవర్సీస్ లో బడా హీరోలకు షాక్!

టాలీవుడ్ లో టాప్ హీరోస్ ఎవరు అంటే అందులో ఖచ్చితంగా ఉండే మూడు పేర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్…సూపర్ స్టార్ మహేష్…పవర్ స్టార్ పవన్  కల్యాణ్…వారి చరిష్మా రేంజ్ కి తగ్గట్టుగా టాలీవుడ్ ను ఏలుతున్న ఈ ముగ్గురు హీరోలకు అనుకోని షాక్ ఇచ్చారు ఎన్.ఆర్.ఐ లు. అసలు మ్యాటర్ ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకు ఓవర్ సీస్ కలక్షన్స్ కీలకంగా మారడంతో టాప్ హీరోల ఓవర్ సీస్ కలక్షన్స్ మధ్య పోటీ కూడ విపరీతంగా పెరిగి పోతోంది. దీనికితోడు టాప్ హీరోల సినిమాలను ఓవర్ సీస్ ప్రేక్షకులు బగా చూస్తున్న నేపధ్యంలో కలక్షన్స్ బాగా పెరిగి ఓవర్ సి మార్కెట్ లో టాప్ హీరోల మూవీలకు మంచి ఆఫర్లు ఓవర్ సీస్ బయ్యర్ల నుండి వస్తున్నాయి. ఇంతవరకూ బ్రహ్మాండంగానే ఉంది…అసలు కధ ఇక్కడే మొదలయైంది…మ్యాటర్ లోకి వెళితే…తాజాగా నిర్మాణం జరుపుకుంటున్న ఏ బడా హీరో సినిమాను భారీ మొత్తలకు కొనే ఆలోచన ఎన్.ఆర్.ఐ లకు లేదని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్….విషయంలోకి వెళితే…టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు మహేష్, ఎన్టీఆర్, పవన్ సినిమాలను ఓవర్సీస్‌లో కొనుగోలు చేయడానికి డిస్టిబ్యూటర్లు రావడం లేదనే విషయం షాకింగ్ గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తూ నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమాకు సుమారు 100 కోట్ల బడ్జెట్ అయిన నేపధ్యంలో ఈ మూవీ ఓవర్ సీస్ రైట్స్ ను 15 కోట్లకు ఓవర్ సీస్ బయ్యర్లకు ఆఫర్ చేసినట్లు టాక్. అయితే ఆ రేట్ కు కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చేసేది ఏమీ లేక ఆ రేట్ ను 14కోట్లకు తగ్గించారు. అయితే అనుకున్నంత ఆసక్తి కనబరచడంలేదు బయ్యర్స్. ఇక ఇది ఇలా ఉండగా పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీకి కూడ ఇదే గడ్డు పరిస్థితి ఓవర్సీస్ మార్కట్ లో ఏర్పడటం గమనార్హం. ఈ మూవీకి మన తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉన్నా…ఓవర్ సీస్ లో మాత్రం ఈ మూవీని కొనేవాడే లేడు అంటున్నారు. ఇక ఈ మూవీ ఓవర్ సీస్ రైట్స్ ను 20 కోట్లకు ఫిక్స్ చేసిన నేపధ్యంలో ఆ రేటు విని చాలామంది భయ పడిపోతున్నట్లు టాక్. ఇప్పుడు మన ప్రిన్స్ వంతు…..మురగదాస్ మహేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘స్పైడర్’ సినిమాకు కూడ ఇదే పరిస్థితి అని అంటున్నారు. మహేష్ సినిమాలకు ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీకి 25 కోట్ల ఆఫర్ ను ఈసినిమా నిర్మాతలు చెపుతున్నట్లు టాక్. అయితే ఈ రేటు విని కూడ బయ్యర్లు భయపడి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే మన బడా హీరోల సినిమాలు కొనడానికి ఎన్.ఆర్.ఐలు భయపడిపోతున్నారు అని ఇట్టే అర్ధం అయిపోతుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus