`ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

మాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ `ఆక్సిజన్`. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అక్టోబర్ 23న హైద్రబాద్ లో అంగరంగా వైభవంగా చిత్ర బృందం సమక్షంలో జరగనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. ” హై టెక్నిక‌ల్ స్టాండ‌ర్ వేల్యూస్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో రూపొందిన ఈ చిత్రం గోపీచంద్‌గారి కెరీర్‌లోనే స్పెష‌ల్ మూవీ అవుతుంది. గోపీచంద్‌గారు డేడికేష‌న్‌, స‌పోర్ట్‌తో సినిమాను చ‌క్క‌గా పూర్తి చేయ‌గ‌లిగాం. ఫ‌స్ట్ కాపీ సిద్ధ‌మైంది. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై త‌దిత‌ర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఆక్సిజ‌న్ చిత్రాన్ని రూపొందించాం. జ‌గ‌ప‌తిబాబుగారు సినిమాలో కీల‌క‌పాత్ర పోషించారు. ఆయ‌న న‌ట‌న‌కు సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుంది. సీజీ వ‌ర్క్స్ అద్భుతంగా చేశాం. యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన పాట‌ల‌ను అక్టోబ‌ర్ 23న విడుదల చేయనున్నాం. నిజానికి అక్టోబర్ 15న నెల్లూరులో ఆడియోను విడుదల చేద్దామనుకొన్నాం, కానీ అక్కడి వాతావరణం సహకరించకపోవడంతో వాయిదా వేశాం” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus