డిసెంబర్ 21 న శర్వానంద్, సాయి పల్లవిల ‘పడి పడి లేచే మనసు’ విడుదల..!!

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘పడి పడి లేచే మనసు’ .. డిసెంబర్ 21 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని చిత్ర నిర్మాతలు ప్రకటిచారు.. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోల్ కతా సిటీ నేపథ్యంలో జరగనుంది.. ప్రస్తుతం నేపాల్ లో జరిగే తదుపరి షెడ్యూల్ కి సిద్దమవుతుంది చిత్ర బృందం.. లవ్ స్టోరీ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు హనురాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. సినిమా అవుట్ ఫుట్ పై కూడా చిత్రబృందం చాలా హ్యాపీగా ఉంది..

విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకోగా శర్వానంద్ కొత్త లుక్ లో కనిపిస్తూ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్నాడు.. ఈ చిత్రంలో మురళీ శర్మ ,సునీల్, ప్రియదర్శి అభిషేక్ మహర్షి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus