‘పగ పగ పగ’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్

సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా రాబోతోన్న చిత్రం పగ పగ పగ. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. నిర్మాత సత్య నారాయణ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.

రీసెంట్‌గా విడుదల చేసిన సినిమా పోస్టర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయించారు.

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. ‘పగ పగ పగ హీరో అభిలాష్ మా దగ్గర ఎన్నో సినిమాలకు పని చేశారు. ఏదో టాలెంట్ ఉంది అని ప్రోత్సహించాం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నామ’ని అన్నారు.

ఇక ఈ మోషన్ పోస్టర్‌లో తెలుగులో వచ్చిన రివేంజ్ స్టోరీలను చూపించారు. బొబ్బిలి పులి, ఖైదీ, కటకటాల రుద్రయ్య, పగ సాధిస్తా సినిమాలోని డైలాగ్స్, పగ గురించి చెప్పిన ఎమోషన్‌ను చూపించారు. ఇక ఇందులో పగ అనేది ఎంత ఇంపార్టెంట్‌గా ఉండబోతోందో మోషన్ పోస్టర్ ద్వారా చెప్పేశారు.

ఈ చిత్రంలో బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌గా పాపారావు వ్యవహరించారు. రామ్ సుంకర ఫైట్ మాస్టర్‌గా పని చేశారు.

ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీని త్వరలోనే మేకర్లు ప్రకటిచనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus