Bigg Boss 7 Telugu: యావర్ తో కలిసి స్కెచ్ గీసిన రతిక..! లైవ్ లో ఏం జరిగిందంటే.,,

బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రతిక మెల్లగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ప్రశాంత్ తో ఓపెన్ అప్ అయి మాట్లాడింది. నిజానికి అంతకుముందే యావర్ తో ప్రశాంత్ గురించి మాట్లాడింది. వచ్చిన దగ్గర్నుంచీ అతను నాతో మాట్లాడటం లేదని, అసలు ఏంటి ప్రాబ్లమ్ అని అడుగుతున్నా పక్కకి వెళ్లిపోతున్నాడని చెప్పింది. దీంతో యావర్ సార్ట్ అవుట్ చేస్కోవాడనికి హెల్ప్ చేశాడు. ముగ్గురూ కూర్చుని మాట్లాడుకున్నారు. ఇక్కడే రతిక ప్రశాంత్ ని సూటిగా ఒక ప్రశ్న వేసింది. అక్కా అని ఎందుకు అన్నావ్ ? మరి అంతకు ముందు వారాల్లో నువ్వు నాతో చేసిందేంటి అని అడిగింది ?

దీనికి ఆన్సర్ చెప్పకుండా ప్రశాంత్ అక్కా అంటే తప్పేంటి అంటూ రివర్స్ లో మాట్లాడాడు. అంతేకాదు, ప్రశాంత్ ఎక్కడా కూడా రతిక ట్రాప్ లో చిక్కకుండా తప్పించుకున్నాడు. ఫస్ట్ వీక్ లో లేడీ లక్ అని బ్యాండ్ కట్టావ్, తర్వాత నాతోనే ఉన్నావ్ , ట్రాక్ నడిపించావ్ నన్నెందుకు బత్నామ్ చేశావ్ చెప్పు అంటూ రివర్స్ లో మాట్లాడింది. నేనేం చేయలేదు. నీకు కూడా తెలుసు ఏం జరిగిందనేది అంటూ ప్రశాంత్ మాట్లాడాడు. అంతేకాదు, తర్వాత నువ్వు కెప్టెన్సీ టాస్క్ ఆడేటపుడు చాలా మాటలు అన్నావ్ అన్నాడు.

మీ అమ్మా- నాన్న ఇలాగే పెంచారా అంటూ మాట్లాడావ్ నాకు చాలా బాధేసిందంటూ ఏడ్చేశాడు. దీంతో పల్లవి ప్రశాంత్ తో కనెక్షన్ కలుపుకుందా అనుకున్న రతిక స్కెచ్ మొత్తం రివర్స్ అయిపోయింది. ప్లాన్ అంతా పటాపంచల్ అయిపోయింది. రతిక యావర్ సపోర్ట్ తెచ్చుకుంది. యావర్ కి అక్కడ ప్రశాంత్ భాష – బాధ రెండూ అర్ధం కాకుండా పోయాయ్. ఇక రతిక ట్రాప్ లో పడి ఫస్ట్ టూ వీక్స్ గేమ్ లో పూర్తిగా పక్కకి వచ్చేశాడు ప్రశాంత్. రతిక ఎలిమినేషన్ తర్వాత (Bigg Boss 7 Telugu) గేమ్ లో కానీ, టాస్క్ లో కానీ దూసుకుపోతున్నాడు.

దీంతో ఇప్పుడు రతికతో అస్సలు బాండింగ్ పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోడు. కలవడు. దీనికి శివాజీ సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా తన డెసీషన్ ఫైనల్ గా చెప్పేస్తాడు. రతికకి కుండ బద్దలు కొట్టినట్లుగా అక్కా అనే పిలుస్తా ఇంకో ముచ్చటే లేదంటూ తెగేసి చెప్పేశాడు ప్రసాంత్. ఈవిషయంలో నిజంగా ప్రశాంత్ హైలెట్ అనిపించాడు. అంతేకాదు, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ప్రశాంత్ కి అందరూ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus