Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఆస్తుల లెక్క తెలిస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

  • September 19, 2023 / 10:38 PM IST

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ కు ఏ రేంజ్ లో పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతుబిడ్డ కావడంతో పల్లవి ప్రశాంత్ కు సామాన్యుల నుంచి సపోర్ట్ అందుతుండగా సోషల్ మీడియాలో సైతం పల్లవి ప్రశాంత్ పేరు మారుమ్రోగుతోంది. అయితే పల్లవి ప్రశాంత్ ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పల్లవి ప్రశాంత్ కుటుంబం మధ్య తరగతి కుటుంబమే అయినా 26 ఎకరాల పొలం ఉందని తెలుస్తోంది.

ఈ పొలం విలువ కోట్ల రూపాయలు అని సమాచారం. లగ్జరీ ఇల్లుతో పాటు ఖరీదైన కారు కూడా పల్లవి ప్రశాంత్ కు ఉందని బోగట్టా. పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా భారీ రేంజ్ లో సంపాదిస్తుండగా ఆ డబ్బులను రైతుల కోసమే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో రతికకు దూరంగా ఉంటే బెటర్ అని రతికకు దూరంగా ఉంటే పల్లవి ప్రశాంత్ పై నెగిటివిటీ మరింత తగ్గుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) తనకు బయట ఉన్న క్రేజ్ ను సరిగ్గా వాడుకుంటే బెటర్ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అఖిల్ సార్థక్, మరి కొందరు సెలబ్రిటీలు సైతం పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ గా పోస్ట్ లు పెడుతుండటం గమనార్హం. పల్లవి ప్రశాంత్ వారానికి లక్ష రూపాయల చొప్పున పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది.

పల్లవి ప్రశాంత్ కు రెమ్యునరేషన్ కంటే బిగ్ బాస్ షో ద్వారా వచ్చే గుర్తింపే ముఖ్యమని తెలుస్తోంది. టాప్5 కంటెస్టెంట్లలో పల్లవి ప్రశాంత్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో విజేతగా నిలవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus