బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో తర్వాత ఎన్నో వివాదాలలో చిక్కుకున్నారు. అయితే బిగ్ బాస్ ఉత్సవం ప్రోమోలో బిగ్ బాస్ షో తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి పల్లవి ప్రశాంత్ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షోకు విజేతగా నిలిచిన సమయంలో మా నాన్న కళ్లలో ఆనందం చూడాలని అనుకున్నానని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు.
కానీ నేను అరెస్ట్ కావడం వల్ల మా నాన్న కోర్టు బయట ఎదురుచూడాల్సి వచ్చిందని ఆ సమయంలో ఎంతో బాధ కలిగిందని పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేశారు. ఈ నెల 18వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతోంది. పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ కావడంతో ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) టాలెంట్ కు తగిన గుర్తింపు రాబోయే రోజుల్లో దక్కుతుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో తర్వాత సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా లేరు. పల్లవి ప్రశాంత్ కెరీర్ ప్లానింగ్ కు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. పల్లవి ప్రశాంత్ పాలిటిక్స్ లోకి వస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో రాజకీయాల్లో సత్తా చాటడం సులువైన విషయం కాదు. బిగ్ బాస్ షో ఇమేజ్ వల్ల చాలామంది కంటెస్టెంట్లకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. బిగ్ బాస్ షో తెలుగు విజేతలలో చాలామందికి తర్వాత రోజుల్లో ఆశించిన రేంజ్ లో గుర్తింపు దక్కలేదు. బిగ్ బాస్ షో సీజన్ 8 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా సీజన్8 ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.