బిగ్ బాస్ హౌస్ లో నాలుగోవారం ఇమ్యూనిటీ కోసం పెద్ద పైట్ జరిగింది. గాల గ్యాంగ్ కాంపీటీషన్ లో జడ్జిలు ముగ్గురూ కలిసి శుభశ్రీ బాగా ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా రెడీ అయ్యిందని ఆమెకి కంటెండర్ షిప్ అర్హతని కల్పించారు. దీంతో అమర్ నాకు ఎందుకు ఇవ్వలేదని జడ్జిలని నిలదీశాడు. శివాజీకి అమర్ కి పెద్ద యుద్ధమే జరిగింది. ఆ తర్వాత శివాజీ జాస్ అలూసాస్ రూమ్ లో కూర్చుని తన గురించి చెప్తూ బిగ్ బాస్ నన్ను పంపించేయ్ అంటూ మళ్లీ క్యాసెట్ మొదలెట్టాడు.
ఇక ముగ్గురు కంటెండర్స్ పవర్ అస్త్రా కోసం ఫస్ట్ ఒక టాస్క్ ఆడారు. పవర్ అస్త్రాని ఒక్క చేత్తో పట్టుకుని నుంచోవాలి అన్నాడు బిగ్ బాస్. దీంతో ముగ్గురూ కూడా పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నించారు. దీంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని కావాల్సిన వారికి మద్దతు ఇస్తూ డిస్టర్బ్ చేస్కోవచ్చని చెప్పాడు. కానీ, కంటెండర్స్ ని మాత్రం టచ్ చేయద్దని కండీషన్ పెట్టాడు. ఇక రతిక అండ్ అమర్ ఇద్దరూ కూాడ మాటలతో పల్లవి ప్రశాంత్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
ఫస్ట్ వీక్ లో కావాలనే కంటెంట్ ఇచ్చి ఇప్పుడు అక్కా అనడానికి సిగ్గుండాలి అని, బుర్రలో అంతా మట్టే ఉందని, అసలు ఎందుకు గేమ్ ఆడుతున్నావో అర్ధమవుతోందా.. సిగ్గుందా అంటూ రతిక రెచ్చిగొట్టే వాఖ్యలు చేసింది. దీనికి అమర్ కూడా పల్లవి ప్రశాంత్ లాగా మాట్లాడుతూ మరింత రెచ్చగొట్టాడు. అయినా కూడా రైతుబిడ్డ ప్రశాంత్ ఎవరినీ పట్టించుకోలేదు. మొదటి నుంచీ కూడా పల్లవి ప్రశాంత్ కి రెండు ముఖాలు ఉన్నాయని అమర్ ప్రూవ్ చేసే ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ, ఆ ఛాన్స్ పల్లవి ప్రశాంత్ ఇవ్వడం లేదు.
ఇక ఎవ్వరూ కూడా చేయి వదలకుండా పట్టుదలతో పట్టుకునే సరికి బిగ్ బాస్ వాళ్లలో వాళ్లే త్యాగం చేయచ్చని కూడా చెప్పాడు. అయినా కూడా కంటెండర్స్ దేనికి ఒఫ్పుకోలేదు. దీంతో ఆ టాస్క్ ని రద్దు చేసి , గార్డెన్ ఏరియాలో బ్యాలన్సింగ్ టాస్క్ పెట్టాడు. బ్యాలన్సింగ్ టాస్క్ లో ప్రిన్స్, ఇంకా శుభశ్రీ ఇద్దరూ కూడా అవుట్ అయిపోయారు. దీంతో పల్లవి ప్రశాంత్ రెండు వారాల ఇమ్యూనిటీని దక్కించుకున్నాడు. అంతేకాదు, కన్ఫార్మ్ కంటెస్టెంట్ అయ్యాడు. దీంతో ఇప్పటివరకూ బిగ్ బాస్ హౌస్ లో 4గురు కంటెంస్టెంట్స్ కన్ఫార్మ్ కంటెస్టెంట్స్ గా మారారు.
ఫస్ట్ సందీప్, తర్వాత శివాజీ, తర్వాత శోబాశెట్టి ఆ తర్వాత ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మొత్తం నలుగురు అయ్యారు. ఫైనల్ గా ఇంకో వారం లాస్ట్ వీక్ 1వారం ఇమ్యూనిటీ కోసం టాస్క్ పెడతాడు బిగ్ బాస్. దీంతో 5గురు ఎలిమినేట్ అవుతారు. 5గురు కన్ఫార్మ్ కంటెస్టెంట్స్ అవుతారు. 4గురు పార్టిసిపెంట్స్ గానే మిగిలిపోతారు. మరి వాళ్లని ఏం చేస్తాడు. కొత్తగా వచ్చే వాళ్లని వైల్డ్ కార్డ్ ద్వారా ఎలా లోపలకి పంపిస్తాడు అనేది బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఈ సీజన్ లో సరికొత్తగా ప్లాన్ చేశారు.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !