Pallavi Prashanth: యూట్యూబ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. తండ్రికి సాయం చేస్తూ?

బిగ్ బాస్ షో సీజన్7 విజేతగా నిలిచిన పల్లవి పశాంత్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసిన చిన్నచిన్న తప్పుల వల్ల తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతకాలం యూట్యూబ్ కు సైతం దూరంగా ఉన్న పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ తన పొలంలో పండించిన పత్తిని మార్కెట్ లో విక్రయించే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ ను స్వయంగా డ్రైవ్ చేయడంతో పాటు పత్తి బస్తాలను తూకం వేయించి వచ్చిన డబ్బులను తండ్రికి ఇచ్చారు.

శివాజీ చెప్పిన మాటలు పల్లవి ప్రశాంత్ పై ఎంతో ప్రభావం చూపాయని తెలుస్తోంది. ఇకపై హుందాగా ఉండే వీడియోలు చేయాలని పల్లవి ప్రశాంత్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్ కు మానిటైజేషన్ కూడా పూర్తైందనే సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ వీడియోలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. బిగ్ బాస్ షో ద్వారా దక్కిన ఫ్రైజ్ మనీని పల్లవి ప్రశాంత్ అతి త్వరలో రైతులకు పంపిణీ చేయనున్నారని తెలుస్తోంది.

పల్లవి ప్రశాంత్ అభిమానులు సెల్ఫీలు అడగగా వాళ్లతో ప్రేమగా మాట్లాడుతూ సెల్ఫీలు ఇవ్వడం గమనార్హం. పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న టీవీ షోలలో సందడి చేస్తూ నెటిజన్లకు, అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.

పల్లవి ప్రశాంత్ కు (Pallavi Prashanth) సినిమా ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ ను కెరీర్ కోసం ఏ విధంగా వినియోగించుకుంటారో చూడాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూలకు, మీడియాకు మాత్రం దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus