Pallavi Prashanth: ఏకంగా ఆ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేశాడు..!

  • December 1, 2023 / 05:48 PM IST

తెలుగు బుల్లితెర పై సంచలనం సృష్టించిన రియాలిటీ షో ‘బిగ్ బాస్. ఈ షో ఇప్పటి వరకు తెలుగులో 7వ సీజన్ నడుస్తోందని అందరికి తెలిసిందే. అయితే ఈ సీజన్ మొత్తం ఉల్టా-పల్టా అన్న మాటను ప్రతి వారం నిజం చేసుకుంటు వస్తున్నారు బిగ్ బాస్ టీమ్. అయితే ఈ షోకి రైతు బిడ్డగా, ఒక సామాన్యుడిగా పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి విషయం అందరికి తెలిసిందే..తన గేమ్ తో అందరిని ఆశ్చర్యపర్చున్నాడు.

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మొదట్లో కాస్త ఆటలో తడపడినా, ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విజృంభించేసాడు. ఏ రేంజ్ లో అంటే ఇలాంటి ఆటగాడిని ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్ర లోనే ఎప్పుడూ చూడలేదు అనే రేంజ్ లో ఆడాడు. అందుకే ప్రతీ ఒక్కరికి పల్లవి ప్రశాంత్ ఫేవరెట్ అయిపోయాడు. వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఒకరట. ఈయన ఈ బిగ్ బాస్ సీజన్ ని చాలా బాగా ఫాలో అయ్యాడట.

ఇప్పటి వరకు (13వ వారం) ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో పల్లవి ప్రశాంత్ ఆట తీరు హరీష్ శంకర్ కి బాగా నచ్చిందట. ఇతను ఉన్నత స్థాయికి కచ్చితంగా చేరుకుంటాడు, ఇతను పైకి ఎదిగేందుకు మనం కూడా ఒక బాట వేద్దాం అనే మంచి ఉద్దేశ్యం తో ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం లో ఒక మంచి పాత్ర ని ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడట.

కేవలం పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే కాదు , ఈ చిత్రం తర్వాత చెయ్యబోయే రవితేజ సినిమాలో కూడా పల్లవి ప్రశాంత్ కి అవకాశం ఇవ్వబోతున్నాడట. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే పల్లవి ప్రశాంత్ కి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక నటించేందుకు రెమ్యూనరేషన్ అడ్వాన్స్ చెక్ ని ఇవ్వడానికి సిద్ధం అయ్యాడట హరీష్ శంకర్. చూడాలి మరి బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus