Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ విషయంలో కుట్రలు జరుగుతున్నాయా.. ఏం జరిగిందంటే?

  • December 10, 2023 / 02:55 PM IST

బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారో లేదో చెప్పలేం కానీ టాప్3లో పల్లవి ప్రశాంత్ ఉంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పల్లవి ప్రశాంత్ కు ఓట్లు పడకుండా కుట్ర జరుగుతోందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్ కు ఓటింగ్ వేయడానికి ఇచ్చిన నంబర్ సరిగ్గా పని చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇతర కంటెస్టెంట్ల విషయంలో ఎలాంటి సమస్యలు లేవని పల్లవి ప్రశాంత్ ఫోన్ నంబర్ కు మాత్రమే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని బిగ్ బాస్ అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ విషయంలో కుట్రలు జరుగుతున్నాయని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. పల్లవి ప్రశాంత్ ఫోన్ నంబర్ కు సంబంధించిన సమస్యను వేగంగా పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పవచ్చు.

పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టడానికి పడిన కష్టం మామూలు కష్టం కాదు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ విషయంలో ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ తప్పును గుర్తించి సమస్యను పరిష్కరిస్తే మంచిది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి శోభాశెట్టి ఎలిమినేట్ కానున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.

బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను భారీ లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. ఈ షోకు గెస్ట్ లుగా హాజరయ్యే సెలబ్రిటీలు ఎవరో తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షో సీజన్7 మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. బిగ్ బాస్7 హిట్ సీజన్ కావడంతో తర్వాత సీజన్లపై అంచనాలు పెరుగుతున్నాయి. బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు కూడా భారీ రేటింగ్ ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus