తెలుగు రాష్ట్రాల్లో పందెం కోడి 2 నాలుగు రోజుల్లో సాధించిన కలక్షన్స్

  • October 22, 2018 / 11:55 AM IST

2005 లో హీరో విశాల్ చేసిన పందెం కోడి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపుదిద్దుకున్నమూవీ పందెం కోడి 2. ఎన్ లింగుస్వామి తెరకెక్కించిన ఈ మూవీ ఈనెల 18 న రిలీజ్ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయి మంచి కలక్షన్స్ రాబడుతోంది. విశాల్, కీర్తి సురేష్ రొమాన్స్ తో పాటు వరలక్ష్మి నటన ఈ సినిమాకి ప్లస్ అయింది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్, అక్షయ్ లతో కలిసి విశాల్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు… కోట్లల్లో…

ఏరియా : కలక్షన్స్ (షేర్ )
నైజాం : 1 .41
సీడెడ్ : 1 .27 ఉత్తరాంధ్ర : 0.68
గుంటూరు : 0.54
కృష్ణ : 0.35 ఈస్ట్ గోదావరి : 0.29
వెస్ట్ గోదావరి : 0.29
నెల్లూరు : 0.18 మొత్తం : 5.05

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus