గోపీచంద్ న‌టించిన 25వ చిత్రం ‘పంతం’ పెద్ద హిట్ కావాలి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ‘పంతం’. ఎన్నో హిట్‌ చిత్రాలకు వర్క్‌ చేసిన ప్రముఖ రచయిత కె. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై అభిరుచి గల నిర్మాత కె.కె. రాధామోహన్‌ ‘పంతం’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మిస్తున్నారు. హిట్‌ చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విజయవాడలో అశేష ప్రేక్షకాభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జూన్‌ 21న జరిగింది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘పంతం’ చిత్రం జూలై 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మినిస్ట‌ర్ దేవినేని ఉమామహేశ్వర్‌రావు, ఎఫ్‌.డి.సి.చైర్మన్‌ అంబికా కృష్ణ, దేవినేని అవినాశ్‌, దేవినేని చందు, ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, గోపీచంద్‌ మలినేని, రత్నకుమార్‌, భాస్కర భట్ల, సంపత్‌ నంది, బాబీ, మెహరీన్‌, గోపీసుందర్‌, ప్రసాద్‌ మూరెళ్ల తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కార్య‌క్ర‌మానికి విచ్చేసిన దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేయ‌గా.. ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ తొలి ఆడియో సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా…

ఆంధ్రప్రదేశ్‌ మినిస్ట‌ర్ దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ – ”గోపీచంద్‌గారు ఒంగోలు గిత్త. కృష్ణాజిల్లా పడమటి లంక అల్లుడు. ఈ వేడుకకు రాగానే నాకు టి.కృష్ణగారు గుర్తుకు వచ్చారు. 1983-85 మధ్యలో కృష్ణగారు తెలుగుజాతి గర్వపడే సినిమాలు చేశారు. ఆయన తీసిన సినిమాలను నేటి సినిమా రంగం ఆదర్శంగా తీసుకోవాలి. నేటి భారతం, రేపటి పౌరులు, వందేమాతరం, దేవాలయం, ప్రతిఘటన.. ఈ ఆరు సినిమాలు ఆరు అద్భుతాలు. గొప్ప దర్శకుడు. సమాజానికి తన సినిమాలతో స్ఫూర్తినింపారు. ఈతరం బ్యానర్‌పై మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు గోపీచంద్‌గారు పంతం పట్టి సమాజాన్ని పీడించే సమస్యలను తన సినిమాలో చూపిస్తున్నారు గోపీచంద్‌గారు తండ్రి స్ఫూర్తిని తీసుకుని ఈతరం బ్యానర్‌ను బ్రతికించాలని కోరుతున్నాను. టి.కృష్ణగారి పేరును మూడు దశాబ్దాల తర్వాత కూడా తలుచుకుంటున్నామంటే ఆయనకు సమాజం పట్ల ఉన్న బాధ్యత అర్థమవుతుంది. ఆయన ఓ కసితో సినిమాలు చేసి జాతికి అందించారు. గోపీచంద్‌ ఆరు అడుగుల అందగాడు. తను ఎగ్రెసివ్‌ హీరోగా అందరినీ ఎలాగైతే తండ్రి భావాలను పుణికి పుచ్చుకుని అలరిస్తున్నాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్‌ చక్రవర్తిని, నిర్మాత రాధామోహన్‌గారిని, కెమెరామన్‌ ప్రసాద్‌ మూరెళ్ల, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ సహా ఎంటైర్‌ యూనిట్‌కి అభినందనలు. సినిమా పెద్ద హిట్‌ కావాలి” అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌.డి.సి చైర్మన్‌ అంబికా కృష్ణ మాట్లాడుతూ – ”ఎన్టీఆర్‌గారు పుట్టిన వైబ్రేషన్‌ ఉన్న ప్రాంతమిది. సినిమా రంగానికి మొట్టమొదటి నుండి సక్సెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా విజయవాడ నిలుస్తూ వస్తుంది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో సినిమా రంగం ఈ సీమకు దూరమైంది. స్టూడియోలు, ఆర్టిస్టులు .. అన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయి. నేను గోపీచంద్‌గారి గత ఆడియో ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు ఆంధ్రాలో ఓ షెడ్యూల్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలని కోరాను. సరేనని అప్పుడు ఆయన మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారమే ఆయన ఓ షెడ్యూల్‌ను వైజాగ్‌లో చిత్రీకరించారు. ఇదే పంతంతో పెద్ద హీరోలందరూ చిరంజీవిగారు, బాలకృష్ణగారు సహా 14 మంది హీరోలు ఒకొక్క షెడ్యూల్‌ చేసినా.. ఇక్కడున్న వారికి అన్నం దొరుకుతుంది. కాబట్టి హీరోలందరూ ఓ షెడ్యూల్‌ అయినా చేయాలని కోరుతున్నాను. చంద్రబాబుగారితో చెప్పి.. చిన్న సినిమాల కోసం ఓ ప్రపోజల్‌ పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో చేసే నాలుగు కోట్ల రూపాయల లోపు నిర్మించే సినిమాలకు టాక్స్‌ ఫ్రీ ఇవ్వాలని ప్రపోజల్‌ పెడుతున్నాం. ఏడాదిలో వంద చిన్న సినిమాలు రూపొందుతున్నాయి. అందులో 70 సినిమాలు ఆంధ్రప్రదేశ్‌లో రూపొందినా ఇక్కడ చాలా మందికి జీవనోపాధి దొరుకుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. మంచి నిర్మాత రాధామోహన్‌గారు.. ఓ బాధ్యత గల వ్యక్తి. చక్రవర్తి రూపంలో పెద్ద డైరెక్టర్‌ ఇండస్ట్రీకి రాబోతున్నాడు. గోపీచంద్‌ అరడుగుల అందగాడు. పరతంగా మాట నిలబెట్టుకున్నాడు. ఈ సినిమా యూనిట్‌కు అభినందనలు” అన్నారు.

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమా స్టార్ట్‌ కావడానికి ఇద్దరు వ్యక్తులు ముఖ్య కారణం. వారే ప్రసాద్‌ మూరెళ్ల.. రైటర్‌ రమేశ్‌ రెడ్డిగారు. ‘ఓ కుర్రాడి వద్ద మంచి కథ ఉంది. మీరు వినండి’ అని వారు అనడంతో కథ విన్నాను. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే కథ బాగా నచ్చింది. ‘కథ బాగా చెప్పావ్‌.. బాగా తీస్తావా?’ అని అడిగాను. ఆరోజు ఏమైనా ఫీల్‌ అయ్యాడో ఏమో కానీ.. ‘లేదు సార్‌.. అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను’ అని అన్నాడు. చెప్పినట్లే అద్భుతంగా తీశాడు. నా 25 సినిమాల్లో యజ్ఞం సినిమాలో మంచి మెసేజ్‌ ఉంటుంది. అలాంటి సినిమా పంతం. ఓ స్ట్రాంగ్‌ మెసేజ్‌.. చెప్పగలిగానని నాకు తృప్తిగా ఉన్నాను. నాన్నగారి చేసిన సినిమాల రేంజ్‌లో ఉంటుందని నేను చెప్పలేను. కానీ ఆ టింజ్‌ ఈ సినిమాలో ఉంటుంది. చాలా మంచి కథ. ప్రసాద్‌ మూరెళ్లగారు.. బ్యాక్‌బోన్‌లా ఈ సినిమాకు వెనుక నిలబడ్డారు. రాధామోహన్‌గారు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. జెన్యూన్‌ ప్రొడ్యూసర్‌. గోపీసుందర్‌గారు అద్బుతమైన మ్యూజిక్‌ డైరెక్టర్‌. చాలా పెద్ద సంగీత దర్శకుడు. పాటలే కాదు.. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉంటుందనే నమ్మకం ఉంది. మెహరీన్‌ చాలా బాగా చేసింది. డేడికేటెడ్‌ నటి. తను ఇంకా మంచి సినిమాలు చేస్తుంది. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌” అన్నారు.

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – ”గోపీచంద్‌గారి 25వ చిత్రం. ప్రెస్టీజియస్‌ మూవీని నిర్మించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్‌. చక్రవర్తిగారు కథను చెప్పగానే నచ్చింది. చెప్పినట్లు చక్కగా తెరకెక్కించారు. గోపీసుందర్‌గారు బ్రహ్మాండమైన మ్యూజిక్‌ అందిచారు. ప్రసాద్‌ మూరెళ్లగారు, ఎ.ఎస్‌.ప్రకాశ్‌గారు, గోపీసుందర్‌గారు చక్కగా సపోర్ట్‌ చేశారు. అనుకున్న ప్లానింగ్‌లో సినిమాను పూర్తి చేసి జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మనదేశాన్ని పీడించే సమస్యను ఆధారంగా చేసుకుని సినిమాను చేశాం. చిన్న మెసేజ్‌తో పాటు కమర్షియల్‌ విలువలతో చేసిన సినిమా ఇది” అన్నారు.

చిత్ర దర్శకుడు కె.చక్రవర్తి మాట్లాడుతూ – ”గోపీసుందర్‌గారు వండర్‌ఫుల్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. భాస్కరభట్లగారు మంచిసాహిత్యాన్ని అందించారు. ప్రసాద్‌ మూరెళ్లగారు ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. ఆయన లేకంటే ఈ ప్రాజెక్ట్‌ సాధ్యమయ్యేది కాదు. అమేజింగ్‌ విజువల్స్‌ ఇచ్చారు. అలాగే ఇతర టెక్నీకల్‌ టీంకు థాంక్స్‌. రాధామోహన్‌గారు ఆయన బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌. నేను ఒక యాక్షన్‌ సీన్‌ను రాసుకుంటే దానికి వందకు డెబ్బై మార్కులుంటే.. గోపీచంద్‌గారు యాక్ట్‌ చేసిన తర్వాత సీన్‌కు వందకు రెండు వందల మార్కులు వస్తాయి. స్క్రీన్‌పై చూసే వారికి గూజ్‌బామ్స్‌ వస్తాయి. ఆయన డైలాగ్‌ చెబితే అంత మాన్లీగా ఉంటుంది. కమాండబుల్‌ యాక్టింగ్‌, వాయిస్‌ ఉన్న హీరో. డెబ్యూ డైరెక్టర్‌లా కాకుండా నేను చెప్పేదంతా వింటూ వచ్చారు. అది కూడా కొత్త దర్శకుడైనా నాకు 25వ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్‌. కుటుంబ సభ్యులు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. అందరికీ థాంక్స్‌” అన్నారు.

చిత్ర సంగీత దర్శకుడు గోపీసుందర్‌ మాట్లాడుతూ – ”గోపీచంద్‌గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నా సంగీతాన్ని ఆదరిస్తున్న తెలుగు సినిమా దర్శక నిర్మాతలకు, అభిమానులకు థాంక్స్‌” అన్నారు.

దేవినేని అవినాశ్‌ మాట్లాడుతూ – ”గోపీచంద్‌గారు ఎంతో కష్టపడి ప్రతి సినిమాను చేస్తుంటారు. విజయవాడలో ఆయన 25వ సినిమా ఆడియో వేడుక జరగడం ఎంతో ఆనందంగా ఉంది. పంతం సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

దేవినేని చందు మాట్లాడుతూ – ”పంతం సినిమా గోపీచంద్‌గారి 25వ సినిమా. ఇలాంటి సినిమా పాటల వేడుకను విజయవాడలో నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నేను డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఉంటున్నాను. ఆయన యజ్ఞం సినిమా నుండి గౌతమ్‌ నంద వరకు డిస్ట్రిబ్యూట్‌ చేయడం కానీ.. మా థియేటర్‌లో రన్‌ చేయడం కానీ చేస్తున్నాం. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్‌ కావాలి” అన్నారు.

భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ – ”ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ – ”గోపీచంద్‌ ఎగ్రెసివ్‌ హీరో. మా ఒంగోలు గిత్త.. డైలాగ్స్‌ చెప్పడంలో దిట్ట. ఎక్స్‌ట్రార్డినరీ డైలాగ్స్‌ పలికించడంలో దిట్ట. ప్రతి ఘటన, రేపటి పౌరులు వంటి సినిమాలు చేసి గోపీచంద్‌గారి తండ్రి టి.కృష్ణగారు తన సినిమాల ద్వారా సోషల్‌ మెసేజ్‌లను ఇచ్చారు. ఇప్పుడు గోపీచంద్‌గారు పంతం ద్వారా ఓ సోషల్‌ మెసేజ్‌ ఇవ్వబోతున్నారు. కచ్చితంగా గోపీచంద్‌కి ఈ చిత్రం మైల్‌స్టోన్‌ మూవీ అవుతుంది. డైరెక్టర్‌ చక్రవర్తి నా బలుపు, డాన్‌ సినిమాకు అసోసియేట్‌గా పనిచేశారు. కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. తన ఫస్ట్‌ మూవీ, బెస్ట్‌ మూవీ కావాలి. గోల్డెన్‌ హీరోయిన్‌ మెహరీన్‌ ఇందులో నటించింది. గోపీసుందర్‌గారి సంగీతానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఎక్స్‌ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు. ప్రసాద్‌ మూరెళ్లగారు ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్‌ అందించారు. చక్రిని నమ్మి తనకు అవకాశం ఇచ్చిన గోపీచంద్‌, రాధామోహన్‌గారికి థాంక్స్‌” అన్నారు.

డైరెక్టర్‌ సంపత్‌ నంది మాట్లాడుతూ – ”నిర్మాతగారు రాధామోహన్‌గారితో 12-13 ఏళ్ల పరిచయం ఉంది. నాకు దర్శకుడిగా మంచి బ్రేక్‌ ఇచ్చారు. ఆయన చేస్తున్న సినిమా ఈ సినిమా కలర్‌ఫుల్‌ హిట్‌ అవుతుంది. చక్రవర్తికి ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. గోపీచంద్‌గారు చాలా సెన్సిబుల్‌ పర్సన్‌. ఆయనతో రెండున్నరేళ్ల పరిచయం ఉంది. ఆరడుగుల మంచితనం.. 75 కిలోల మంచితనం కలిపితే గోపీచంద్‌గారు. ఈ సినిమా పక్కా హిట్‌ అవుతుంది” అన్నారు.

డైరెక్టర్‌ బాబీ మాట్లాడుతూ – ”డైరెక్టర్‌ చక్రవర్తి నాతో కొన్ని ఏళ్లుగా ట్రావెల్‌ చేస్తున్నాడు. తనని నమ్మి సినిమా ఇచ్చిన గోపీచంద్‌గారికి, రాధామోహన్‌గారికి నా తరపున కృతజ్ఞతలు. కథ తెలుసు. హ్యూజ్‌ హిట్‌ అవుతుంది. డైరెక్టర్‌ని అర్థం చేసుకునే టెక్నిషియన్స్‌ ప్రసాద్‌ మూరెళ్ల, గోపీసుందర్‌, భాస్కరభట్ల వంటివారు ఈ సినిమాకు పనిచేశారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus