సినిమా అంటేనే అదృష్టం…అయితే ఒక దర్శకుడు తనలోని ఆలోచనల్ని, తెరపై సరైన పద్దతిలో ఆవిష్కరించగలిగితే అంతే చాలు సినిమాకు మంచి జరుగుతుంది. కానీ కొన్ని సమయాల్లో సినిమా ఎంత బాగా వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మన్న సంధర్భాలు ఎక్కువ. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో చిన్న సినిమాల హవా నడుస్తున్న సంధర్భంలో అల్లు వారి వారసుడు అల్లు శిరీష్ తో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాను నిర్వహించాడు మన దర్శకుడు పరశురామ్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ సాధించడంతో పాటు…శిరీష్ కరియర్ లోనే ఫర్స్ట్ హిట్ గా నిలుస్తుంది.
అదే క్రమంలో ఒకానొక ఇంటెర్వ్యు లో మాన్శు విప్పి మాట్లాడిన దర్శకుడు పరశురామ్…తన కరియర్ గురించి చెబుతూ….మాస్ మహా రాజా రవితేజతో చేసిన సారొచ్చారు సినిమా ఫ్లాప్ అవుతుంది అని తనకు ముందే తలుసు అని తెలిపాడు…ఆ విషయం గురించే చెబుతూ…ఆ సినిమా విడుదల కావటానికి నాలుగు రోజుల ముందు ఫైనల్ కాపీ చూశానని.. అప్పుడే సినిమా ప్లాప్ అవుతుందని తనకు అర్థమైందని చెప్పారు. కానీ.. అప్పటికి తానేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి డిజాష్టర్ ను మూట గట్టుకుందో మనకు తెలిసిందే. ఇక అదే క్రమంలో తనకు గీతా ఆర్ట్స్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి సైతం పరశురామ్ ఈ ఇంటెర్వ్యు లో వివరించాడు….