Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం.. ‘ప్రేమించొద్దు’ – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం.. ‘ప్రేమించొద్దు’ – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్

  • May 16, 2024 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం.. ‘ప్రేమించొద్దు’ –  టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేస్తున్నారు..అలాగే తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా గురువారం నాడు మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..

సూపర్ వైజింగ్ ప్రొడ్యూసర్ నిఖిలేష్ తొగరి మాట్లాడుతూ.. ‘నేను సినిమాను చూశాను. శిరీన్ ఏడ్పించేశాడు. ఆయన సినిమాను తీయలేదు.. ఎమోషన్‌ను తీశాడు. స్టార్టింగ్‌లో ఓ తమిళ్ సినిమాలా అనిపించింది. తెలుగులో ఆ తమిళ్ ఫ్లేవర్‌ను నేచురల్‌గా తీశాడు. ఒక్కో పాత్ర అద్భుతంగా ఉంటుంది. కారెక్టర్ నేమ్స్‌తోనే ఆర్టిస్టులు గుర్తుండిపోతారు. అనురూప్ అద్భుతంగా నటించారు. ప్రతీ ఒక్క ఫీమేల్ కారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది. థియేటర్లో ఈ సినిమాను అందరూ చూడండి. చూసిన ప్రతీ ఒక్కరికీ మూవీ నచ్చుతుంది. మన జీవితాల్లోంచే ఈ పాత్రలు వచ్చినట్టుగా కనిపిస్తాయి. మూడు గంటల పాటు కంటి రెప్ప వేయకుండా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు చూపించేదే కాదు.. ప్రతీ పిల్లవాడు తల్లిదండ్రులకు చూపించే చిత్రంగా ఉంటుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. జూన్ 7న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘మేం ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో తెరకెక్కించాం. ఏ భాషలో స్క్రీనింగ్ చేసినా కూడా స్ట్రెయిట్ ఫిల్మ్‌ అనేలా ఉందని ప్రశంసించారు. నాకు ఎంతగానో సహకరించిన టీంకు థాంక్స్. మా టీం అంతా తెరపై కనిపించనట్టుగా ఉండరు. చాలా కామ్‌గా ఉంటారు. మా సినిమా జూన్ 7న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హీరో అనురూప్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బంధూక్, శేఖరం గారి అబ్బాయి అనే సినిమాలు చేశాను. నాకు ఇది మూడో చిత్రం. ఎన్నో కష్టాలు పడి సినిమాను తీశాం. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. ప్రతీ తల్లిదండ్రులు వారి పిల్లలకు దగ్గరుండి మరీ చూపించే సినిమా అవుతుంది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందరూ ఆదరించాలి. శిరీన్ అన్న ఇంతకు ముందు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశారు. మూడేళ్లు కష్టపడి ఆయన ఈ మూవీని తీశారు. ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుంది. మా సినిమాను ఆడియెన్స్ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

నటి సంతోషి మాట్లాడుతూ.. ‘మూవీ చాలా బాగా వచ్చింది. నాకు మంచి కారెక్టర్‌ను ఇచ్చారు. హీరో, దర్శక నిర్మాతలు ఎంతో సహకరించారు’ అని అన్నారు.

నటి సోనాలి గర్జె మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. హీరోయిన్‌గా నటించడమే కాకుండా దర్శకత్వ శాఖలో పని చేశాను. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మూవీ ఉంటుంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.

నటి మానస మాట్లాడుతూ.. ‘షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నాకు ఈ చిత్రంలో మంచి కారెక్టర్‌ను ఇచ్చారు. మెచ్యూర్డ్ అమ్మాయి, కష్టాల్లో తోడు ఉండే స్నేహితురాలి పాత్రలో కనిపిస్తాను. మా చిత్రం జూన్ 7న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

నటీనటులు: అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు

సాంకేతిక వర్గం: రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం – శిరిన్ శ్రీరామ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ – జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ – కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ – చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ – హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే – షిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, అసోసియేట్ డైరెక్టర్ – సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ – అజయ్(ఏజే ఆర్ట్స్), వి.ఎఫ్.ఎక్స్- వి.అంబికా విజయ్, లొకేషన్ సౌండ్ – మహేష్ పాశం, డబ్బింగ్ ఇంజనీర్ – అనూప్ చౌదరి, సూపర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌: నిఖిలేష్ తొగ‌రి, పి.ఆర్.ఒ – చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

10 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

11 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

13 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

1 day ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

1 day ago

latest news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

4 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

5 hours ago
Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

5 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

6 hours ago
Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version