KGF2 Movie: ‘కేజీయఫ్‌’ సెకండ్‌ పార్ట్‌పై పరుచూరి పంచనామా ఇదే!

అంచనాలు లేకుండా వచ్చి.. అద్భుతమైన విజయం అందుకున్న చిత్రం ‘కేజీయఫ్‌’. యశ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ నీల్ తెరకకెక్కించారు. ఆ సినిమా రికార్డుల గురించి, అందులో ఎలివేషన్ల గురించి, మాస్‌ ఎలిమెంట్ల గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో వచ్చిన ‘కేజీయఫ్‌ 2’ కూడా భారీ విజయం దక్కించుకుంది. అయితే తొలి ‘కేజీయఫ్‌’కి మించిన ఫ్యాన్స్‌ ఫీల్‌ని మాత్రం తీసుకురాలేకపోయింది అనే చెప్పాలి. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా అదే మాట అంటున్నారు. అంతే కాదు ఎందుకు తక్కువగా ఉంది అనేది కూడా చెప్పారు.

‘కేజీయఫ్‌ 2’పై ‘పరుచూరి పలుకులు’ పేరుతో పరుచూరి గోపాలకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. ‘కేజీయఫ్‌ 2’లో ఓ సీన్‌ తనకు మింగుడుపడలేదని, దాన్ని మరోలా తీసుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ చిత్రంలోనైనా కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. అయితే అవి జరగలేదని సమర్థించుకోలేం. ‘కేజీయఫ్‌ 2’ రివ్యూలు చూస్తే ‘ఆహా ఓహో’ అని పెద్దగా రాయలేదు. విమర్శనాత్మకంగానే రాశారు.

2018లో ‘కేజీయఫ్‌ 1’ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత రెండో పార్టు విడుదలైంది. పార్ట్‌ 1 చూస్తేనే గానీ, పార్ట్‌ 2 అర్థం కాదేమో అనుకునే పరిస్థితి నెలకొంది. కానీ దర్శకుడు తన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చేసి అర్థం చేశారు. హీరో ‘కేజీయఫ్‌ 1’లో పేదవాడు నుంచి ధనికుడిగా మారితే… ‘కేజీయఫ్‌ 2’లో అపర కుబేరుడిగా కనిపిస్తాడు. సంపాదించిందంతా తనొక్కడే తినకుండా అనుచరుల క్షేమాన్నీ కోరుకుంటాడనేలా హీరో పాత్రని తీర్చిదిద్దాడు.

ముస్లిం కుర్రాడి పాత్ర పోషించిన యువకుడు ఈ సినిమాకి రెండో హీరోగా అనిపిస్తాడు. నరాచీ చెక్‌పోస్ట్‌ నేపథ్యంలో ఆ పాత్ర చనిపోయినా.. హీరో దగ్గర పనిచేసే అమ్మలంతా తిట్టకుండా ఆశీర్వదిస్తారు. హీరో ఎంతగా వారికి సాయపడ్డాడో ఈ దృశ్యం ద్వారా తెలివిగా చెప్పారు దర్శకుడు. రెండు సినిమాలను దర్శకుడు ఫిక్షనల్‌ స్టోరీలుగా ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించలేదు. రమికా సేన్‌ (రవీనా టాండన్‌) పాత్ర.. ఇందిరా గాంధీని గుర్తు చేసేలా ఉంటుంది.

రాఖీ భాయ్‌ పార్లమెంట్‌లో చర్చకు వెళ్లడం… పోలీసులు, సీబీఐ రంగంలోకి దిగడం లాంటి సన్నివేశాలు చూస్తే ఇదేదో జరిగిన కథే అనే ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలుగుతుంది. దీంతో ఇదేదో జరిగిన కథ అనే ఫీల్‌ కలిగించింది. సినిమాలో యశ్‌ని సంజయ్‌దత్‌ చంపేసే అవకాశం ఉన్నప్పటికీ ‘పో వెళ్లిపో’ అని వదిలేస్తాడు. ఆ షాట్‌ అందరికీ నచ్చదు. ఆ తర్వాత మరో షాట్‌లో సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతుంది. అయితే ఈసారి రివర్స్‌లో. ఇవి అంతగా ఆకట్టుకోలేదు.

ఇక రాఖీ భాయ్‌ పార్లమెంట్‌కు వెళ్లి ప్రధాన మంత్రి ఎదురుగానే పాండ్యన్‌ని కాల్చి చంపినట్లు చూపించారు. ఆ సీన్‌ బాగున్నప్పటికీ పార్లమెంట్‌లో కాకుండా పార్టీ కార్యాలయంలో చిత్రీకరించి ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. ప్రధానమంత్రిని ఎదురుగా ఓ వ్యక్తిని కాల్చేయడం మింగుడుపడని విషయం. ఇక హీరోయిన్‌ పాత్రను గర్భవతిగా చూపించి చంపేశారు. ఆ అమ్మాయి ఉండుంటే కడుపున పుట్టేవాడు ‘కేజీయఫ్‌ 3’లో హీరోగా వస్తాడనే భావన కలిగేది.

క్లైమాక్స్‌లో సముద్రంలో హీరో మునిగిపోతున్నట్లు చూపించి.. అతడు చనిపోయాడని ప్రకాశ్‌రాజ్‌ పాత్రతో చెప్పించారు. మూడో ఛాప్టర్‌ తీస్తే రాఖీబాయ్‌పై 16 దేశాల్లో ఉన్న కేసులపైనే సినిమా ఉండొచ్చు. సముద్రంలో మునిగిపోయినట్లు చూపించిన రాఖీ భాయ్‌ మళ్లీ బతికే ఉన్నట్లు చూపించే అవకాశమూ ఉంది. ఆఖరిగా ‘కేజీయఫ్‌ 1’లో ఉన్నంత పకడ్బందీ స్క్రీన్‌ప్లే ‘కేజీయఫ్‌ 2’లో లేదు అని పరుచూరి చెప్పుకొచ్చారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus