టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ ప్రాజెక్ట్ లలో దేవర(Devara) ఒకటి కాగా దేవర తెలుగు ట్రైలర్ కు ఏకంగా 42 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా ట్రైలర్ లోని మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri GopalaKrishna) మాట్లాడుతూ రామాయణం స్పూర్తితో దేవర తెరకెక్కిందేమో అని కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)మా కొడుకులాంటి వ్యక్తి అని పరుచూరి పేర్కొన్నారు. శ్రీరాముడు రావణుడి కోసం సముద్రం దాటిన ఘట్టాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ సినిమాలోని సీన్స్ రూపొందించారేమో అని అనిపించిందని పరుచూరి పేర్కొన్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో గమ్మత్తులు ఉన్నాయని ట్రైలర్ చూస్తే అనిపించిందని ఆయన తెలిపారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్రను సరదాగా, అమాయకత్వంతో తీర్చిదిద్దారని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సినిమాలో సముద్రంలోనే యుద్ధం జరుగుతుందని అందుకే “రక్తంతో ఎరుపెక్కే సముద్రం కథ” అనే డైలాగ్ చెప్పారని ఆయన అభిప్రాయపడ్డారు. ” మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు.. చంపేంత కాదు” అనే డైలాగ్ ఎన్నో ఆలోచనలను కలిగించిందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలోని ప్రతి అంశం రామాయాణాన్ని పోలి ఉంటుందని అనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. దేవర మూవీ విషయంలో పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) చెప్పిన కామెంట్లు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. దేవర సినిమా నిడివి ఎంత ఉంటుందనే చర్చ జోరుగా జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయి.
బుకింగ్స్ విషయంలో దేవర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. దేవర సినిమా సక్సెస్ సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను మరింత పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దేవర మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు 350 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.