Damodar Prasad: ఎంత పెద్దవారినైనా మేము విచారిస్తాం.. దామోదర్ ప్రసాద్ కామెంట్స్ వైరల్!

Ad not loaded.

టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ (Pooam Kaur)  త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)  పేరును ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఒకింత సంచలనం అయింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పూనమ్ కౌర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య వివాదం ఏంటి? త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పూనమ్ కౌర్ ఎందుకు టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. జానీ మాస్టర్ వివాదం సోషల్ మీడియాలో ఒకింత సంచలనం అయింది. ఈ వివాదాన్ని మరవక ముందే పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ద్వారా కొత్త వివాదం మొదలైంది.

Damodar Prasad

ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ (K L Damodar Prasad) ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ మహిళల భద్రత విషయంలో ఇతర ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే ఎంతో ముందుందని తెలిపారు. అమ్మాయిలకు వర్క్ ప్లేస్ లో వేధింపులు ఉంటే ఎంత పెద్దవాళ్లనైనా విచారిస్తామని ఆయన అన్నారు. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తెలిపారు. పూనమ్ కౌర్ కమిటీలో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు.

ఎవరికి ఎంత ఇన్ ఫ్లూయెన్స్ ఉన్నా కమిటీ విచారణ మాత్రం న్యాయబద్ధంగానే జరుగుతుందని దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. జానీ మాస్టర్ (Jani Master)  కేసులో కమిటీ రిపోర్ట్ ను బహిర్గతం చేయబోమని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం వైపు నుంచి గైడ్ లైన్స్ వస్తే కమిటీకి మరింత బలం చేకూరుతుందని దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.

ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కామెంట్ల నేపథ్యంలో పూనమ్ కౌర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. పూనమ్ కౌర్ ఈ వివాదానికి ఏ విధంగా చెక్ పెడతారో చూడాల్సి ఉంది. పూనమ్ కౌర్ పోస్టుల గురించి మాత్రం నెట్టింట ఒకింత ఎక్కువగానే చర్చ జరుగుతోంది.

పుష్ప 2 సెట్స్ లో ఆ అమ్మాయి టాలెంట్ చూసాను.. ఆమె ఖచ్చితంగా నిలదొక్కుకుంటుంది.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus