వైరల్ అవుతున్న ప్రముఖ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఎవరనే హోదా గురించి కొంతకాలం క్రితం ఊహించని స్థాయిలో రచ్చ జరిగిందనే సంగతి తెలిసిందే. కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ సూపర్ స్టార్ గా ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుండటం గమనార్హం. కోలీవుడ్ హీరో విజయ్ కు సూపర్ స్టార్ అనే ట్యాగ్ కరెక్ట్ అని మరి కొందరు కామెంట్లు చేశారు.

అయితే సూపర్ స్టార్ అనే ట్యాగ్ గురించి దూత వెబ్ సిరీస్ లో నటించిన పార్వతి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన పార్వతి మరియాన్, ఉత్తమ విలన్, చెన్నైయిల్ ఆరునాళ్, బెంగళూరు నాట్కల్, మరికొన్ని హిట్ సినిమాలలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం పార్వతి తంగలాన్ అనే సినిమాలో విక్రమ్ తో కలిసి నటిస్తున్నారు.

30కు పైగా సినిమాలలో నటించిన ఈ నటి ఒక సందర్భంలో సూపర్ స్టార్ పట్టం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ అనే ట్యాగ్ సమయానుకూలంగా చెప్పుకునేది మాత్రమేనని దానివల్ల ఎవరికి ప్రయోజనమని ఆమె అన్నారు. ఆ ట్యాగ్ వల్ల ఇమేజ్ వస్తుందా అనేది కూడా తెలియటం లేదని పార్వతి కామెంట్లు చేశారు. నన్ను ఎవరైనా సూపర్ స్టార్ అని పిలవడం కంటే సూపర్ యాక్టర్ అని పిలవడం సంతోషంగా ఫీలవుతానని పార్వతి వెల్లడించారు.

పార్వతి పూర్తి పేరు పార్వతి తిరువోతు కాగా ఆమె తన నటనతో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. ఫాహద్ ఫాజిల్, అసీఫ్ అలీ, రామీ కళింగల్ సూపర్ యాక్టర్స్ అని పార్వతి వెల్లడించడం గమనార్హం. పార్వతి రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని ఆమె అభిమానులు ఫీలవుతున్నారు. పార్వతి తిరువోతు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus