షారుఖ్‌ మేనియా అంటే ఇదీ.. మూడో వారంలో ఎంత వసూలు చేసిందంటే..?

  • February 17, 2023 / 01:24 PM IST

కొన్నిసార్లు రావడం లేట్‌ అవ్వొచ్చు.. కానీ రావడం పక్కా! ఇదే సినిమాలో డైలాగ్‌ అనేది చాలామంది తెలుసు. అయితే ఇదే డైలాగ్‌ను సినిమాలకు అన్వయిస్తే కొన్నిసార్లు రావడం లేట్‌ అవ్వొచ్చు.. కానీ రావడం పక్కా.. వసూళ్ల రికార్డులు తిరగరాయడమూ పక్కా. తాజాగా ఇదే డైలాగ్‌ను బాలీవుడ్‌లో ఓ సినిమా గురించి, అలాగే ఓ హీరో గురించి అంటున్నారు. ఆ సినిమా ఏంటి, ఆ హీరో ఎవరు అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది.

అతనే మన ‘పఠాన్‌’ అలియాస్‌ షారుఖ్‌ ఖాన్‌. ‘పఠాన్‌’ సినిమాతో షారుఖ్‌ బాలీవుడ్‌ రికార్డులను మరోసారి రాస్తున్నాడు. ఆకలి మీద ఉన్న సింహం వేటకు దిగితే పంజా దెబ్బ ఎలా ఉంటుందో చెప్పడానికి ‘పఠాన్‌’ సినిమా వసూళ్లు చూపిస్తే చాలు. ఎందుకంటే ఈ సినిమా రూ. 1000 కోట్ల వసూళ్లకు దగ్గరలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ లెక్క అయితే.. మన దేశంలో 22 రోజులకుగాను రూ. 502 కోట్లు సాధించింది.

ఈ క్రమంలో సినిమా వాలంటైన్స్ డే రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.5.65 కోట్లు సాధించిందని వార్తలొస్తున్నాయి. మూడోవారంలో ఓ భారతీయ సినిమా సింగిల్ డే హయ్యస్ట్ కలెక్షన్ ఇదే కావడం విశేషం. దీంతో ‘పఠాన్‌’ పంజా దెబ్బ అదుర్స్‌ అంటూ షారుఖ్‌ ఫ్యాన్స్‌ చాలా ఆనందపడిపోతున్నారు. ఓ హిందీ సినిమా మన దేశంలో రూ. 500 కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్రబృందం ప్రేక్షకులకు ఓ ఆఫర్‌ ప్రకటించింది. ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 17ను ‘పఠాన్‌ డే’గా అభివర్ణిస్తూ ఆ ఒక్క రోజు ఐనాక్స్‌, పీవీఆర్‌, సినీపోలిస్‌తోపాటు మరికొన్ని మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ. 110గా ఉంటుందని తెలిపింది. అయితే ఈ ప్రకటనపై షారుక్‌ స్పందిస్తూ ‘‘అవునా అయితే ఆ రోజు సినిమా చూడాల్సిందే. మరి పాప్‌కార్న్‌ ఫ్రీగా ఇవ్వగలరా!’’ అని చిత్ర నిర్మాతను సరదాగా అడిగారు. దీంతో ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus