కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) లేటెస్ట్ మూవీ ‘పట్టుదల’ (Pattudala) నిన్న అంటే ఫిబ్రవరి 6న తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. త్రిష (Trisha) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మగిల్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్( Arjun Sarja), రెజీనా(Regina Cassandra)..లు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. రెండు, మూడు యాక్షన్ బ్లాక్స్ తీసేస్తే సినిమా అంతా చాలా స్లోగా ఉందని, అజిత్ వంటి స్టార్ హీరో ఇలాంటి పేలవమైన కథాంశంతో కూడిన సినిమాలు చేయడం ఏంటని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అలాగే అభిమానులు కూడా దర్శకుడిని తిట్టిపోస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అయినప్పటికీ ఈ సినిమా తమిళంలో రూ.25 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బజ్ లేకుండా అంత కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ తెలుగులో దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.15 cr |
సీడెడ్ | 0.07 cr |
ఉత్తరాంధ్ర | 0.12 cr |
ఈస్ట్ | 0.34 cr |
‘పట్టుదల'(తెలుగు) కి రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘పట్టుదల’ మొదటి రోజు కేవలం రూ.0.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.