పవన్ కావాలనే అలా చేసాడట..!

పవన్ కళ్యాణ్, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లోని నొవెటల్ హోటల్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. మొదట అసలు ఆడియో ఫంక్షన్ చేద్దామా..? వొద్దా..? అనుకోని ఫైనల్ గా చేయడానికే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఫంక్షన్ కు పాసులు లేని వారు రావొద్దని పవన్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ను నిర్వహించి తన అభిమానులకు విన్నపం చేశారు.

నిజానికి ఈ ఆడియో ఫంక్షన్ పాసులు మంత్రుల చేతుల్లోకి వెళ్లాయని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు మంత్రులు ఒక్కొక్కరు 100 పాసుల చొప్పున ముందుగానే తీసేసుకున్నారట. వారి బంధువులు, సన్నిహితుల ఈ ఫంక్షన్ కు వస్తుండడంతో కావాలనే అభిమానులను దూరంగా ఉంచినట్లు సమాచారం. ఆ విషయం తెలిసే ముందుగానే పవన్ తన ఫ్యాన్స్ కు సమాచారం ఇచ్చినట్లు టాక్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus