Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

  • December 23, 2025 / 03:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

తమ ప్రైవసీకి భంగం కలుగుతోంది, తమ అనుమతి లేకుండా వీడియోలను మార్ఫింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో సిద్ధం చేస్తున్నారు.. దీన్ని అడ్డుకోండి అంటూ తెలుగు సినిమాల హీరోలు వరుస పెట్టి దిల్లీ హైకోర్టు తలుపుతడుతున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా, ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లలో చేస్తున్న పోస్టుల కారణంగా తమ వ్యక్తిగత హక్కులు దెబ్బ తినకుండా రక్షణ కల్పించాలని వరుసగా హీరోలు, నటులు కోర్టును ఆశ్రయించారు. కొంతమంది విషయంలో తీర్పులు కూడా వచ్చాయి. అయితే తొలిసారి కోర్టులో మరో పాయింట్ చర్చలోకి వచ్చింది.

Pawan and Tarak

ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున తరహాలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, కథానాయకుడు పవన్‌ కల్యాణ్.. మరో నటుడు ఎన్టీఆర్‌ దిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్‌ మన్‌ప్రీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోడా ఇటీవల విచారణ జరిపారు. పవన్‌ కల్యాణ్, ఎన్టీఆర్‌ ఫొటోలు, వీడియోలు, పేర్లను వాణిజ్య అవసరాలు, తప్పుడు ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల్లో దుర్వినియోగం చేస్తున్న వాటిని అడ్డుకోవాలని వారి తరఫున వాదనలు వినిపించిన సాయి దీపక్‌ న్యాయమూర్తిని కోరారు.

ఈ మేరకు కొన్ని సాక్ష్యాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫ్లిప్‌క్టార్, అమెజాన్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌, గూగుల్‌లో ఉన్న ఇలాంటి పోస్టులను తొలగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కూడా కోరారు. ఈ వాదనలపై ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు ఇది వరకు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి వివాదాస్పద యూఆర్‌ఎల్స్‌ను తొలగించామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏదైనా యూఆర్‌ఎల్‌ / కంటెంట్‌ను తొలగించాలని ఆదేశాలిచ్చేటప్పుడు వాటిని పోస్ట్‌ చేసిన వినియోగదారుల వాదనలూ వినాల్సి ఉంటుందని అన్నారు.

ఇకపై ఎవరైనా నెటిజన్లు సెలబ్రిటీలు/ హీరోల వీడియోలు, కంటెంట్‌ను పోస్ట్‌ చేసినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ స్పష్టంగా డిస్‌క్లైమర్‌ ముద్రించాలని సూచించారు. సెలెబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తే జరిగే పరిణామాల గురించి తమ వినియోగదారులకు గూగుల్‌ చెప్పాలని సూచించారు. ఆ తర్వాత కూడా ఎవరైనా అలా నడుచుకుంటే వారి ఖాతాలను సస్పెండ్‌ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. పవన్, ఎన్టీఆర్‌ పిటిషన్లలో ప్రస్తావించిన వివాదాస్పద పోస్టులకు సంబంధించిన ఐపీ లాగిన్‌ వివరాలను మూడు వారాల్లో సమర్పించాలని ప్రతి వాదులకు కోర్టు ఆదేశించింది.

 ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #pawan kalyan

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

1 hour ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

1 hour ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

15 mins ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

55 mins ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

3 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

4 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version