ఒకటి కాదు….రెండు కాదు….అక్షరాల 33ఏళ్లు అన్నగారు ‘తెలుగుదేశం’ పేరుతో డిల్లీ నడివీదుల్లో తాకట్టు పెట్టిన తెలుగు ఆత్మ గౌరవ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ అయ్యారు. మళ్లీ అదే కోపం, అదే కసి, అదే రోషంతో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తు, నిరసిస్తూ పవన్ కల్యాణ్ తిరుపతిలో సభను ఏర్పాటు చేసి కేంద్రాన్ని విమర్శించారు. అదే క్రమంలో ఆయన మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా తమ హక్కు అని, ఆది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని తెలిపాడు.
మూడు రాష్టాల ముఖ్యమంత్రులు అడ్డు పడుతూ ఉన్నారు అని అందుకే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం అంటూ చెబుతున్న ప్రభుత్వం అప్పుడు విభజన సమయంలో 6కోట్ల మందిని ఎలా మరచిపోయారు అని ఆయన ప్రశ్నించారు. కొంగ్రెస్ పార్టీ చేసిన తప్పే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అని, అదే క్రమంలో కొంగ్రెస్ హయాంలో ఆ పార్టీ ఎంపీలు ఎలా అయితే మేడమ్ అంటూ సోనియా గాంధీని రిక్వెస్ట్ చేసేవారో, అదే రకంగా ఇప్పుడు ఎంపీలు సైతం సార్…సార్ అంటూ మోడిని పిలవడంతోనే సరిపోతుంది కానీ, పౌరుషంతో, బానిసలుగా కాకుండా పోరాటాన్ని కొనసాగించాలి అని పవన్ పిలుపునిచ్చాడు. పవన్ మాటలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఆయన మాట్లాడిన మాటల్లో అర్ధం లేకపోలేదు, ప్ర్యాక్టికల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడున్న వర్తమాన రాజకీయాల్లో పవన్ ఎంచుకున్న నినాదం వర్కౌట్ అవడానికి చాలా తక్కువ చాన్సస్ ఉన్నాయి అనే చెప్పాలి. ఏది ఏమైనా పవన్ గర్జన మొదలు పెట్టాడు. అది ఎంతవరకూ దారి తీస్తుందో చూడాలి.
నేను వాళ్ళకి మాత్రమే భజన చేస్తాను : పవన్ కళ్యాణ్
ప్రస్తుతం తిరుపతి ఇందిరా గ్రౌండ్స్ లో పవన్ కళ్యాణ్ మాటల తూటాలు పేల్చుతూ తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నాడు. సమస్యలనేవి నూడీల్స్ లాంటివి కాదు రెండు నిమిషాల్లో సాల్వ్ చేయడానికి. నా రాజకీయ తెరంగేట్రం తర్వాత నా మీద చాలా ఆరోపణలు, అవహేళనలు వచ్చాయి. వారందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే.. “నేను తెలుగుదేశం పార్టీకో లేక మోడీకో భజన చేయట్లేదు, చేయను కూడా. నా భజన ప్రజల సమస్యల గురించి” అంటూ చాలా ఘాటుగా తన విమర్శకులకు సమాధానమిచ్చాడు పవన్ కళ్యాణ్!
కళ్యాణ్ కూతురు క్రిస్టియన్!
కులమతాలకు అతీతంగా ఉంటామని చాలా మంది ఏదో పేరు కోసం చెప్పుకొంటుంటారు. కానీ చాలా తక్కువమంది దాన్ని ఫాలో అవుతుంటారు. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన మూడో భార్య అన్నా లేజ్నోవా రష్యాకు చెందిన స్త్రీ కావడంతో.. పెళ్లయ్యాక మతం మార్చేసుకొంటుందిలే అనుకొన్నారందరూ. అయితే.. “సర్దార్ గబ్బర్ సింగ్” సెట్ లో కళ్యాణ్ మూడో కూతురు కనపడగానే “ఏం పేరు పెట్టాడు” అని అనుకొన్నారందరూ. కట్ చేస్తే.. అమ్మాయి పేరు “పోలెనా” అని తెలిసింది. దాంతో కొంతమంది హేటర్స్ ఖంగుతిన్నారు. నేడు కళ్యాణ్ స్వయంగా.. “నా కూతురు క్రిస్టియన్” అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై అతడు కులమతాలకు అతీతంగా వ్యవహరించే విధానం పట్ల అందరికీ విశేషమైన అభిమానం పెల్లుబికింది. ఎంతైనా పవర్ స్టార్ కదండీ!
తల తెగి పడాలి కానీ.. కాలు వెనక్కి తిరగదు : కళ్యాణ్
“మడమ తిప్పని వ్యక్తి” అనే పదం కేవలం పురాణాల్లోనే చదివి ఉంటాం. కానీ.. ఈమధ్యకాలంలో అలాంటి మనుషులు కనపించి ఎరుగరెవ్వరూ. కానీ.. నేడు తిరుపతి అలాంటి వ్యక్తి చూస్తోంది యావత్ ప్రపంచం. అతడి పేరు పవన్ కళ్యాణ్. అతనొక స్టార్ హీరో మాత్రమే కాదు. ప్రజల మనిషి. ప్రజలతో ఉంటాడు, ప్రజల మధ్యన ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు. అందుకే అతడ్ని పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకొన్నా.. మనసులో మాత్రం పీపుల్స్ స్టార్ అని కీర్తించుకొంటారు.
“అడుగేస్తే కాలు విరిగేలాగా ఉండకూడదు. అడుగు ముందుకేస్తే తల ఎగిరిపడాలి..అలాంటి అడుగేయాలి అందుకే అలోచించి అడుగేస్తా” అని పవన్ కళ్యాణ్ నిప్పులు కక్కే కళ్ళతో చెప్పిన తీరు పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే కాదు ప్రతి సీమాంధ్ర పౌరుడిలోనూ పౌరుషాన్ని పెంపొందించింది!
హమ్మయ్య హామీ ఇచ్చేశాడు!
పవన్ కళ్యాణ్ పోలిటికల్ మీటింగ్ పెట్టినప్పుడల్లా.. ఎవరి మీద విరుచుకుపడతాడో, ఏం అడుగుతాడో అని రాజకీయనాయకులు కంగారు పడితే, ఆయన అభిమానులు మాత్రం “ఎక్కడ సినిమాలు మానేస్తాడో” అని భయపడి ఛస్తారు. అయితే.. ఇవాళ మాత్రం పవన్ కళ్యాణ్ “రాజకీయాల్లో కొనసాగుతూనే.. సినిమాలు కూడా చేస్తాను. నా దగ్గర డబ్బుల్లేవబ్బా” అంటూ చమత్కారంగా పవన్ చెప్పిన మాటలు అభిమాన సంద్రంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.
అలాగే.. “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా మీరు సరిగా చూడలేదు అందుకే డబ్బులు రాలేదు. ఈసారి గట్టిగా చూడండి” అని అంత సీరియస్ మీటింగ్ లోనూ అభిమానులతో సరదాగా చెప్పిన విధానం అందర్నీ ఆకట్టుకొంది. సో, మన పవర్ స్టార్ సినిమాలు మానే ప్రసక్తి లేదు, మన ఆయన సినిమాలను థియేటర్లలో ఒకటికి రెండు సార్లు చూడకుండా ఉండే ప్రసక్తి అంతకన్నా లేదు!