ఓ భాషలో సక్సెస్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది కొత్త పద్ధతి ఏమీ కాదు. ఏ భాషలోకి రీమేక్ చేసినా నేటివిటీ అనేది మిస్ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సోల్ ను చెడగొట్టకూడదు. ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్ గా తీసినా ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నెగిటివిటీ కూడా అక్కడి నుండే మొదలవుతుంది. టాలీవుడ్లో అత్యధిక రీమేక్ సినిమాల్లో నటించిన హీరోలుగా విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ల గురించి ఎక్కువగా చెప్పుకుంటారు.
చిరంజీవి కూడా చాలా రీమేక్ సినిమాల్లో నటించారు కానీ.. ఆయన కంటే పవన్, వెంకీ ల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళ కెరీర్లో రీమేక్ లకే పెద్దపీట వేస్తుంటారు.ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుందాం. గతంలో పవన్ కళ్యాణ్ ఓ రీమేక్ సినిమాలో నటించాలని ఆశపడ్డారు. కానీ ఆ సినిమా రీమేక్ హక్కులను రాజశేఖర్ దక్కించుకున్నారు. దీంతో పవన్ సైలెంట్ అయ్యారు. కానీ రాజశేఖర్ కు ఆ రీమేక్ కలిసిరాలేదు.
బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ సినిమా మరేదో కాదు ‘శేషు’. 1999 లో తమిళంలో దర్శకుడు బాల రూపొందించిన ‘సేతు’ కి రీమేక్ ఇది. ఒరిజినల్ లో ‘విక్రమ్’ హీరోగా నటించాడు.అతని నటనకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ‘శేషు’ సినిమా 2002 వ సంవత్సరం ఫిబ్రవరి 28న రిలీజ్ అయ్యింది. తెలుగులో రాజశేఖర్ సతీమణి జీవిత డైరెక్ట్ చేశారు.
కానీ మొదటి షోతోనే ఈ సినిమా ప్లాప్ హిట్ టాక్ ను మూటకట్టుకుంది.రాజశేఖర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి కానీ విక్రమ్ స్థాయిలో పేరు రాలేదు. బాక్సాఫీస్ వద్ద ‘శేషు’ మినిమం కలెక్షన్స్ ను కూడా రాబట్టలేకపోయింది. తమిళ ప్రేక్షకులకు ట్రాజెడీ అంటే ఇష్టం. కానీ తెలుగు ప్రేక్షకులు అంత ట్రాజెడీని ఇష్టపడరు. సో ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ చేయకపోవడమే మంచిదైంది అని వాళ్ళ అభిమానులు ఫీలవుతూ ఉంటారు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!