పవన్ కళ్యాణ్ ఇంట్రావర్ట్. అందరితోనూ కలుపుకోలుగా ఉండలేరు. అయినంత మాత్రాన అసలు మాట్లాడరు అని చెప్పడానికి లేదు. తన ఆలోచనలకు, మనసుకు నచ్చిన వారితో గంటల తరబడి మాట్లాడుతారు. ఒక సారి స్నేహితుడిగా పవన్ స్వీకరిస్తే ప్రాణం పోయే వరకు స్నేహాన్ని విడిచిపెట్టరు. అటువంటి ప్రాణ స్నేహితులు ఎవరంటే…
అలీఅలీ తన పక్కన ఉంటే చాలా ఆనందంగా ఉంటుందని పవన్ చాలా సార్లు చెప్పారు. అందుకే తన సినిమాలో ఆలీకి మంచి రోల్ ఇస్తుంటారు.
త్రివిక్రమ్త్రివిక్రమ్, పవన్ ని కలిపిన విషయం పుస్తకాలు. ఇద్దరికీ పుస్తకాలంటే పిచ్చి. ఇద్దరూ ఎప్పుడు కలిసినా సాహిత్యం గురించి గంటల తరబడి మాట్లాడుకుంటుంటారు.
రాజు రవి తేజసినీ రంగానికి చెందని ప్రాణ మిత్రుడు రాజు రవి తేజ. సమాజంలో మార్పు రావాలనే ఆలోచన రవిని పవన్ ని మిత్రులుగా చేశాయి. మీడియాకి దూరంగా ఉండే ఇతను జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కనిపించారు.
పీవీపీ“అతను నాకు నిర్మాత మాత్రమే కాదు.. మంచి ఫ్రెండ్” అని పీవీపీ (ప్రసాద్ వి పొట్లూరి) గురించి పవన్ అందరి ముందు చెప్పారు.
ఆనంద్ సాయి“పవన్ లేకుంటే నేను లేను” అని పలు సందర్భాల్లో కళా దర్శకుడు ఆనంద్ సాయి చెప్పుకున్నారు. పవన్, సాయి అంత మంచి అనుబంధం ఉంది.
వెంకటేష్పవన్ కి వెంకటేష్ తో చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. వెంకీ ఇంటికి తరచూ వెళ్తుండేవాడినని పవన్ వివరించారు.
శరత్ మరార్రేణు దేశాయ్ ద్వారా పరిచయమైన శరత్ మరార్ .. పవన్ కి చాలా ఇష్టం. పవన్ ఆర్ధిక లావాదేవీలను శరత్ దగ్గరుండి చూసుకుంటుంటారు. “ఆయన (పవన్) నాకు కృష్ణుడు లాంటి వారు” అని శరత్ ఎంతో అభిమానంతో చెప్పారు.
రేణు దేశాయ్రేణు దేశాయ్, పవన్ ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. పెళ్ళికి ముందు, విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉన్నారు.
నర్రా శ్రీనివాస్అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ సినిమాల్లో కామెడీతో అదరగొట్టిన నర్రా శ్రీనివాస్ కూడా పవన్ ప్రాణ స్నేహితుల్లో ఒకరు.