Pawan Kalyan, Chiranjeevi: చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు మెగాస్టార్ చిరంజీవి నేడు 67వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పండగ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన రేర్ ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం చిరంజీవికి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. అన్నయ్య చిరంజీవికి ప్రేమ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టం కల్పించిన ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఒక సన్నని వాగులా ప్రవహిస్తూ మహానదిలా మారినట్లు మీ ప్రయాణం నాకు గోచరిస్తుంది. మీరు ఎదిగి మాకు ఎదగడానికి దారి చూపడమే కాకుండా ఎంతోమందికి మీరు స్ఫూర్తిగా నిలిచారు. మీలో ఉన్న పట్టుదల కృషి సంకల్పం ఎంతోమందికి ఆదర్శం. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మీలో కొంచెం కూడా గర్వం అనేది లేదు. ఇలాగే ఆనందకరమైన సంతోషకరమైన ఆరోగ్యంతో, సంపూర్ణ కరమైన ఆయుషుతో మీరు మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్తడే అన్నయ్య అంటూ పవన్ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇలా మెగాస్టార్ చిరంజీవి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఇతర మెగా కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అదేవిధంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న సందడి చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus