తిరుపతి లడ్డూ విషయంలో నిన్నటి నుండి జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అత్యంత పవిత్రమైన పుణ్య స్థలమైన తిరుపతిలో గొడ్డు మాంసపు కొవ్వు నూనె వినియోగించడం అనేది అత్యంత నీచమైన పని. ఈ విషయమై ప్రపంచంలోని హిందువులందరూ చాలా కోపంగా ఉన్నారు. ఆల్రెడీ ప్రజల్లో చాలా అప్రతిష్టను మూటగట్టుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో జనాలు ఈసడించుకొంటున్నారు. ఈ విషయంలో నిజానిజాలు ఇంకా పూర్తిస్థాయిలో నిర్ధారణ అవ్వాల్సి ఉండగా..
ఈ విషయమై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేవనెత్తిన ఒక పాయింట్ మాత్రం అందర్నీ ఆలోజింపజేస్తుంది. అదే జాతీయ సనాతన ధర్మ రక్షక బోర్డ్. పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు నుంచి సనాతన ధర్మ స్థాపనను తన ముఖ్య ధ్యేయంగా ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూనే వచ్చాడు. ముఖ్యంగా ఎన్నికల్లో ఘనంగా గెలిచిన తర్వాత వారాహి అమ్మవారి వ్రతం చేసి తన నిబద్ధతను చాటుకున్నాడు.
ఇప్పుడు తిరుపతి లడ్డూ విషయంలో జరిగినట్లుగా భవిష్యత్ లో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం “జాతీయ సనాతన ధర్మ రక్షక బోర్డ్”ను స్థాపించడం అనే అంశాన్ని పవన్ ప్రస్తావించడం హిందువులను విశేషంగా ఆకర్షించిన విషయం. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో 200లకి పైగా గుడులు నాశనం అయ్యాయి. అలాగే.. ఇండియా మొత్తంలో కొన్ని వేల గుళ్లు అంతరించిపోయాయి.
ఈ సనాతన ధర్మ ప్రొటెక్షన్ బోర్డ్ గనుక నిజంగా ఆచరణలోకి వచ్చి హిందూ దేవాలయాలను కాపాడుకోగలిగి, భారతీయ హిందూ ధర్మాన్ని గనుక నిజంగా పటిష్టం చేయగలిగితే.. ఆ క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ కే చెందుతుంది. మరి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా లేవనెత్తిన ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందో లేదో చూడాలి.