‘మీరంతా తిడతా ఉంటారు కదా నన్ను.. ఎంతసేపు రీమేక్లు చేస్తావ్.. రీమేక్లు చేస్తావ్ అని..! కరెక్టే.. ఏం చేయమంటారు చెప్పండి. మనకి ఎలాగూ పెద్ద పెద్ద దర్శకులు లేరు.మనం కింద నుంచి వచ్చినవాళ్ళం. నేను ఫాస్ట్ గా సినిమాలు చేయాలి అనుకుంటున్నప్పుడు.. పార్టీ నడపడానికి డబ్బులు అవసరం పడినప్పుడు రీమేక్లు తప్ప నాకు వేరే ఆప్షన్ కనిపించలేదు’ అంటూ నిన్న ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది.
దీనికి మిక్స్డ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. మరో రకంగా ఈ కామెంట్స్ కాంట్రడిక్ట్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన దర్శకులు రాజమౌళి.. తెలుగువారే కదా. అలాగే ‘పుష్ప’ తో దేశం మొత్తాన్ని షేర్ చేసిన సుకుమార్ కూడా తెలుగు వారే కదా. అంతేకాదు శేఖర్ కమ్ముల వంటి దర్శకులు కూడా తెలుగువారే.
వీళ్ళలో పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తాను అంటే.. ఏ దర్శకుడు సిద్ధంగా ఉండడు. పవన్ బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ మాత్రం..’సినిమా చేద్దాం’ అని పవన్ అడిగితే వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్తాడు కదా. ఇంకా ఎంతో మంది టాప్ డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి రెడీగానే ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అలాంటి కామెంట్స్ చేసినట్టు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి మొదటి నుండి కొత్త దర్శకులు, ఇమేజ్ లేని దర్శకులతో సినిమాలు చేయడం అలవాటు.
ఎందుకంటే.. ఆయనకు సెట్స్ లో ఫ్రీడమ్ కావాలి. తన అభిప్రాయాలు తీసుకోగలగాలి.. అలాంటి దర్శకులతోనే పవన్ సినిమాలు చేస్తుంటారు. అన్ని విషయాలు ఓపెన్ గా యాక్సెప్ట్ చేసే పవన్ కళ్యాణ్.. ఈ విషయంలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి టాలీవుడ్లో ఉన్న పెద్ద దర్శకులను అవమానించినట్టే ఉన్నాయని చెప్పాలి.