Pawan Kalyan: రెండు పడవల ప్రయాణంతో ఇబ్బంది పడుతున్నాడా?

ఇటు సినిమాలు, అటు రాజకీయాలు… పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. దేని టైమ్‌ దానికే, దేని ఇంపార్టెన్స్‌ దానికే అని ఆయన చెప్పొచ్చు కానీ… ఈ విషయంలో పవన్‌ చాలా ఇబ్బంది పడిపోతున్నాడని అంటున్నారు సన్నిహితులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు వీలైనన్ని సినిమాలు చేసి… తర్వాత ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోవాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే స్ట్రాంగ్‌ లైనప్‌లో బరిలోకి దిగారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏదీ అనుకున్నది అనుకున్నట్లు సాగలేదు.

ఇప్పుడు ఆ కారణంగా లైనప్‌లో ఓ సినిమా వదిలేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇప్పటివరకు అఫీషియల్‌ అయిన పవన్‌ కల్యాణ్‌ సినిమాల లైనప్‌ చూసుకుంటే… 8వ తేదీ నుండి ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొంటాడు పవన్‌. ఈ సినిమాకు ఇదే ఆఖరి షెడ్యూల్‌ అని కూడా అంటున్నారు. ఆ తర్వాత ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా చేయాలి. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దీని తర్వాత రామ్‌ తాళ్లూరి – సురేందర్ రెడ్డి సినిమా అనౌన్స్‌ చేశారు.

ఆ తర్వాత దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా, భగవాన్‌ – దానయ్య నిర్మాణంలో ఓ సినిమా ఉంటుంది అన్నారు. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే ఇందులో కనీసం రెండు సినిమాలు పక్కకు పోతాయి అని తెలుస్తోంది. కారణం ఆయన మరో రెండు కొత్త కథలను ఓకే చేశారని తెలియడమే. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వినోదాయ సీతాం’ అనే సినిమాను తెలుగులో తీయాలని చూస్తున్నారు. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన అని టాక్‌.

ఇది కాకుండా మరో సినిమా కూడా చర్చల్లో ఉంది అంటున్నారు. వేణు ఉడుగల దర్శకత్వంలో పవన్‌ నటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఈ రెండు సినిమాల కారణంగా లైనప్‌ మారుతుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కడానికి సుమారు ఏడాది ఉంది. వచ్చే ఏడాది ఇదే సమయానికి పవన్‌ అక్కడ జోరు పెంచాలి. అంటే రాబోయే ఏడాదిలో ఎన్ని సినిమాలు చేయగలిగితే అన్నీ చేసేయాలి. ప్రచారం సంగతి ఆ నిర్మాతలు, దర్శకులు చూసుకోవాల్సిందే.

అయితే ‘వినోదాయ సీతాం’ అచేస్తే లైనప్‌లో ఆఖరున ఉన్న సినిమాల్లో ఒకటి ఆపాల్సిందే అంటున్నారు. అయితే అది సురేందర్‌ రెడ్డి సినిమానా? ఆ తర్వాతదా అనేది తెలియడం లేదు. అలాగే వేణు ఉడుగుల సినిమా చేయాలన్నా ఇదే పరిస్థితి. సో పవన్‌ కల్యాణ్‌ పెద్ద తలనొప్పితోనే బాధపడుతున్నారని అంటున్నారు. మరి పవన్‌ ఏం చేస్తాడో చూడాలి. కొత్త లైనప్‌ కోసం పాత లైనప్‌లో ఏమన్నా మార్పులు చేస్తాడో లేక పాతదే యాజ్‌ ఇట్‌ ఈజ్‌ కంటిన్యూ చేస్తాడో.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus