‘టెన్షన్’లో పవన్ అభిమానులు!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు టెన్షన్ లో ఉన్నారా? పవన్ సెంటిమెంట్స్ పుణ్యమా అని భయపడిపోతున్నారా? అసలు కధ ఏంటి? పవన్ అభిమానుల బాధకు కారణం ఏంటి అంటే…ఒకసారి మీరే చదవండి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ షూటింగ్ మొదలయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయినప్పటినుంచీ పవన్ గత సినిమా సర్దార్ పోలికలు కల్పిస్తున్నట్లు అనుమానంతో ఉన్నారు అభిమానులు. ఎలాగా అంటే…సర్దార్ సినిమాలోలాగానే దర్శకుడు మారాడు.

అక్కడ సంపత్ నందిని కాదని, పవన్ బాబీకి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ కూడా అదే సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. సూర్య స్థానంలో డాలి వచ్చాడు. అదే క్రమంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ పూణే లో మొదలు అయిన తరువాత కొంత గ్యాప్ ఇచ్చి పవన్ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.  ఇప్పుడు కూడ అదేవిధంగా పవన్ తన లేటెస్ట్ సినిమా షూటింగ్ మొదలైన రెండు వారాల గ్యాప్ తరువాత ఆగష్టు మూడవ వారం నుండి షూటింగ్ లో జాయిన్ అవుతూ ఉండటంతో, అనుకోకుండా జరుగుతుందా, లేక పవన్ అనుకుని చేస్తున్నాడా అన్న మ్యాటర్ అర్ధం కాక పవన్ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇక మరో పక్క ఫర్స్ట్ లుక్ విషయంలో కూడా అదే టెన్షన్ అభిమానులకి.

ఆ కధ ఏమిటి అంటే…పవన్ లేటెస్ట్ సినిమా ఫస్ట్ లుక్ పవన్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న విడుదల కాబోతోంది. గత సంవత్సరం కూడ ఇదే విధంగా పవన్ పుట్టినరోజు నాడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఇలా ఫస్ట్ లుక్ విడుదల అవడంలో కూడ పవన్ ‘సర్దార్’ సంఘటనలు మళ్ళీమళ్ళీ అనుకోకుండా రిపీట్ అవుతూ ఉండటం ఇవన్ని చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ కు ఏదో జరగకూడనిది జరుగుతుంది ఏమో అన్న భయంతో ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus