కరోనా లాక్ డౌన్ పవన్ ఫ్యాన్స్ ఉత్సాహానికి అడ్డు కట్టవేసింది. అన్నీ కుదిరితే ఇప్పటికే, పవన్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ థియేటర్స్ లో దిగేది. మూడునెలల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ మే నెలలో విడుదల చేయాలని భావించారు. ఐతే లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడడంతో పాటు, విడుదల కూడా ఆగిపోయింది. రెండేళ్లుగా పవన్ ని వెండి తెరపై మిస్సవుతున్న ఫ్యాన్స్ థియేటర్స్ లో వకీల్ సాబ్ తో సందడి చేద్దాం అనుకుంటే అనుకోని ఈ విపరీతం పెద్ద దెబ్బే వేసింది.
కాగా మరో రెండు మూడు నెలల వరకు సినిమా థియేటర్స్ తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీనితో వకీల్ సాబ్ మూవీని డైరెక్ట్ గా ఓ టి టి లో విడుదల చేసే ఆస్కారం కలదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు. లేటైనా పర్లేదు వకీల్ సాబ్ మూవీ థియేటర్స్ లోనే దిగాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పవన్ మూవీ అంటేనే థియేటర్స్ లో ఆయన్ని చూసి చొక్కాలు చింపుకోవాలి. కాబట్టి గుట్టుగా ఎవరింట్లో వాళ్లు చూడడం నచ్చని వ్యవహారం అంటున్నారు.
దానికి తోడు రెండేళ్లుగా ఆయన్ని తెరపై మిస్సైన కారణంగా వకీల్ సాబ్ మూవీ వెండి తెరపై చూసి సందడి చేయాలని వారు భావిస్తున్నారు. దాదాపు 90 శాతం పవన్ అభిమానులు వకీల్ సాబ్ ఓ టి టి విడుదలను వ్యతిరేకిస్తున్నారు. వారి అభిప్రాయం ఏదైనా అది నిర్మాత లాభాల లెక్కలపై ఆధారపడి ఉంటుంది. సినిమా విడుదల లేటయ్యే కొద్దీ నిర్మాతపై భారం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పట్లో జనాలు థియేటర్స్ కి వెళ్లే ధైర్యం చేయకపోవచ్చు. కావున దిల్ రాజు ఓ టి టి లో విడుదల చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
Most Recommended Video
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు