Pawan Kalyan: సినిమా టైటిల్ మర్చిపోయిన పవన్ ..వైరల్ అవుతున్న వీడియో..!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే నాల్గవ షెడ్యూల్ ని కూడా ప్రారంభించుకోబోతుంది. అయితే ఈ సినిమాకి ముందుగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ని పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత స్క్రిప్ట్ మరియు స్టోరీ లో కీలక మార్పులు చేర్పులు చేసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మార్చారు. ఈ టైటిల్ ప్రకటించిన కొత్తల్లో కొంతమంది అభిమానులకు అది నచ్చలేదు. కొంతమందికి మాత్రం బాగా నచ్చింది, ఇప్పుడు అందరికీ ఆ టైటిల్ బాగా అలవాటు అయిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం ఆ టైటిల్ ఇంకా అలవాటు పడినట్టు లేదు.

ఈరోజు మహా న్యూస్ ఛానల్ కి సంబంధించి మరో కొత్త న్యూస్ ఛానల్ ‘మహా మాక్స్’ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ విచ్చేశాడు. ఆయన అక్కడి వచ్చిన మిగిలిన అతిథుల గురించి మాట్లాడుతూ ‘నాతో సర్దార్ భగత్ సింగ్ తీసిన’ అని అంటూ మూవీ టైటిల్ ని మర్చిపోతాడు. ఆ తర్వాత ఫాన్స్ టైటిల్ ని అరిచి చెప్పగా ‘హా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని తీస్తున్న నవీన్ గారికి’ అంటూ పూర్తి చేస్తాడు.

ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇలా తన సినిమాలకు పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు, సినిమా విడుదల తేదీలు మర్చిపోయాడు. దీనికి ఫ్యాన్స్ సొంత సినిమాల పేర్లే మర్చిపోయే రేంజ్ లో ప్రజా సేవలో నిమగ్నమయ్యావా అన్నా అనగా, పవన్ కళ్యాణ్ దురాభిమానులు మాత్రం ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని అంటున్నారు.

https://twitter.com/shr3hs/status/1716705575692873951

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus