ఒక దేశ సంపద యువత మాత్రమే దేశభవిష్యత్తుకు నావికులు యువత నాకు రాజకీయాలమీదు, పదవుల మీద వ్యామోహం లేదు నాకు మీరు పంచే ప్రేమ చాలు కోట్లు సంపాదిస్తాను, కోట్లు ట్యాక్స్ కడతాను నాకు సినిమాల మీద వ్యామోహం లేదు సమాజం మీద దేశమీద వ్యామోహం ఉంది, బాధ ఉంది వర్తమాన రాజకీయాల్లో యువతకు మేలు జరగడంలేదు రెండున్నర గంటల సినిమాల్లో ఎన్నో చేయొద్చు ఆస్తులను దానం చేయొచ్చు, రౌడీలను కొట్టొచ్చు, హీరోయిన్లతో డ్యాన్స్‌లు చేయొచ్చు కాని నిజ జీ వితంలో పరిష్కారాలు దొరకవు: రాందేవ్‌బాబా రెండునిమిషాల నూడుల్స్‌లా పరిష్కారాలు లభించవు: కష్టపడాలి, త్యాగాలు చేయాలి: జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఎదుర్కొన్న విషయాలు చెప్పాలి టీడీపీ ప్రభుత్వ పనితీరుమీద నా అభిప్రాయం చెప్పాలి: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడాలి నేను అడగాల్సినవి, తేల్చుకోవాల్సినవి ఉన్నాయి: సీఎం చంద్రబాబు, నరేంద్ర మోదీ, నేను తొలిసారిగా తిరుపతిలో మీటింగ్ పెట్టాం అందుకే తిరుపతిలోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నా: పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోవడం కష్టం: రాష్ట్రం విడిపోయి సమస్యల్లో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వానికి అండగా నిలబడ్డాను: విమర్శ కూడా సద్వివిమర్శ అయి ఉండాలి
రాజకీయ లబ్ధి పొందే విమర్శలు నేను చేయలేను పవన్ జనసేన పెట్టింది మోదీ భజన సేన చేశానని కొంతమంది అన్నారు తెలుగుదేశం తొత్తులా ఉన్నానని మరికొంతమంది తిట్టారు ఇంకొంతమంది గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అంటున్నారు పడతాం అబ్బా మాటలు, పడకుండా ఉంటామేంటి? తిట్టండి, చిమ్మండీ.. నేను ఉంటాను నేను ఎక్కడికీ పారిపోను నా రాష్ట్రంకోసం, దేశ శ్రేయస్సు కోసం అంకితం చేశాను: మాట ఇస్తే.. తప్పే వ్యక్తిని కాను, మడమ తిప్పే వ్యక్తిని కాను నేను ప్రజాసమస్యలకి నేను భజన సేన నేను మోదీగారికి భజన చేయను సీపీఐ నారాయణ గారు ఈకామెంట్లు చేశారు వామపక్ష పోరాటాలు అంటే నాకు గౌరవం: తరిమెళ్లనాగిరెడ్డి, చెగువేరా పుస్తకాలు నేను చదివాను బాధలకోసం పోరాడిన వ్యక్తి చెగువేరా మానవత్వం కోసం పోరాడినవారు నాకు నిజమైన హీరోలు నేను తెలుగుదేశం తొత్తును అనుకోవద్దు నేను ప్రజల పక్షపాతిని, ప్రజల తొత్తిని రైతులు, ఆడపడుచుల పక్షపాతిని నేను వ్యక్తులకో, పార్టీలకో నా జీ వితాన్ని ఇవ్వను సినిమాలు నాకు ఆనందం కలిగించలేదు మీకు ఆనందం కలిగిస్తున్నాయని సినిమాలు చేస్తున్నా సినిమాను వినోదంగానే చూడండి వేరే హీరోలతో నాకు గొడవలు లేవు సినిమాలను సీరియస్‌గా తీసుకోకండి, నేనుకూడా తీసుకోను నేను నిజ జీ వితాన్ని సీరియస్‌గా తీసుకుంటాను సినిమాలకోసం క్షణికమైన కోపాలకు దిగొద్దు జనసేన సైనికుడు హత్యకు గురైనప్పుడు నాకు బాధ కలిగింది క్షణాకావేశంతో జరిగిన ఘటన ఓ తల్లిని కడుపుకోతకు గురిచేసింది వినోద్ తల్లి.. నాకు ఎంతో గౌరవం ఇచ్చింది ఇలాంటి తల్లుల బిడ్డల భవిష్యత్తుకోసమే రాజకీయాల్లోకి వచ్చా రెండున్నరేళ్లుగా నేను అన్నింటినీ చూస్తున్నా అమరావతిరైతులకు సమస్యలు వస్తే.. మాట్లాడ్డానికి వెళ్లా రైతు పక్షపాతిగా నిలబడ్డానికి ప్రయత్నంచేశా దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించారు టీడీపీ, బీజేపీలకు భుజం కాచాను, దానివల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందా? లేదా? అన్నది నిజంగా నాకుతెలియదు వీటన్నింటినీ నేను ఆలోచించలేదు కాకపోతే మీ అందరి సహాయ సహకారాలతో ఉడతా సాయం చేశాం రాజకీయాల్లో నా అనుభవాలను మీకు వివరిస్తాను అన్ని రిస్క్‌లు ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చాను నాకు అవసరాలు ఏమీ లేవు నేను నరేంద్రమోదీనికి కలిసినప్పుడు , తర్వాత చంద్రబాబుకు మద్దతు పలికినప్పుడు
అన్ని ప్రధాన పత్రికలుకూడా మిమ్మల్ని అందరూ చాలా మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సమాజానికి ఉపయోగపడేవాళ్లు అని రాశారు రాష్ట్ర శ్రేయస్సుకు ఉపయోగపడతారని రాశారు ప్రభుత్వం వచ్చాక..
పనితీరులో ఒకటి రెండు తప్పులు ఉంటాయిప్రజలకు ఇబ్బంది కలిగించే పనులేవో ఉంటాయి అన్నీ సవ్యంగా ఎలా ఉంటాయినేను ఒకటిరెండుసార్లు ఆతప్పులను ఎత్తిచూపించబోయాను టీడీపీ విధివిధానాలను అడగబోయాను ఆతర్వాత ఎడిటోరియల్స్‌లో వెంటనే కులముద్ర వేశారు మనది ఒకటే కులం, ఒకటే మతం.. మానవతా వాదం నాకు ఎక్కడ కులం ఉంది, ఎక్కడ మతం ఉంది నా కూతురు క్రైస్తవరాలు నా కూతురు తల్లి… మతాచారం ప్రకారం రష్యన్ చర్చిలో బాప్టిజం స్వీకరించాను నాకు భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఒక్కడే:
సర్వమతాలూ నాకు ఒక్కటే, సర్వ ప్రాంతాలూ ఒక్కటే అలాంటి నాకు కులం, మతం అంటగడితే అరికాలు నుంచి తలవరకూ కోపం వస్తుంది:
మీరునన్ను ఏదైనా అనండి కాని నాకు కులంగాని, ప్రాంతంగాని ఆపాదిస్తే… నేను వేరే మనిషిని ఆ సంపాదకీయం రాసిన సన్నిహితులకి చెప్పానుసర్..
నేను టీడీపీకి భుజం కాచినప్పుడు నా కులం గర్తుకు రాలేదా? అని అడిగా?రెండు మాటలు అనగానే.. నా కులం గుర్తుకు వచ్చిందా? అని అడిగా తర్వాత వారు.. అలాంటి వాటిని రిపీట్ చేయలేదునేను మభ్యపెట్టను, అబద్ధాలు చెప్పను నేను చేయలేకపోతే.. చేయలేనని దండంపెట్టి క్షమించమని కోరుతాప్రధానిగా ప్రమాణస్వీకారానికి రమ్మని మోదీగారు పిలిచారు వెళ్లి.. శుభాకాంక్షలు చెప్పి వచ్చేసా తర్వాత ఆయన్ని కలవలేదు సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే నేను మాట్లాడతా జాతీయపార్టీలకే భవిష్యత్తు ఉంది, ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులేదని అమిత్‌షా అన్నారు బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారు తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలకోసం జనసేన పుట్టిందని చెప్పాను
కాని జాతీయ దృక్పథం, జాతీయ సమగ్రత ఉన్న పార్టీని చెప్పాను కాని ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను అలా రావాలని అనుకుంటే జనసేన ఎందుకు పెడతాను బీజేపీ అంటే గౌరవం ఉందని మాత్రం చెప్పాను అన్ని సిద్ధాంతాలతో ఏకీభవించలేనని చెప్పాను ఎవరి జెండాను, అజెండాను మోయడానికి జనసేన పార్టీ పుట్టలేదు.
అధికారంలోకి వచ్చాక ప్రధాని విదేశాల్లో తిరుగుతున్నారు, సంబంధాలను బలోపేతం చేస్తున్నారు లేడికి లేచిందే పరుగు ఎందుకని స్పెషల్ స్టేటస్ అడగలేదు అలాగే టీడీపీకి సంపూర్ణ సహకారం అందించాను ఇవ్వలేనిది అడిగి ఇరకాటంలో పెట్టదలచుకోలేదు కాని రెండున్నర సంవత్సరాల తర్వాత అన్నీ అర్థంచేసుకుని.. నాకున్న సందేహాలను సీఎంకు, వారి ప్రభుత్వం ముందు ఉంచుతాను ఈ ఒక్క మీటింగ్‌లో పెట్టలేను గాని, రాబోయే మీటింగ్‌ల్లో పెడతాను కాని స్పెషల్ స్టేటస్ గురించి ఈ మీటింగ్‌లో ప్రస్తావిస్తాను. సీమాంధ్రలంటే చులకనా? పౌరుషం లేనివాళ్లా కాని అటు కాంగ్రెస్ కాని, ఇటు బీజేపీకి గాని ఎందుకు ఇలా ఆడుకుంటోందని అంటున్నారు సీమాంధ్రులకు దేశంపట్ల ప్రేమ ఉంది, నిబద్ధత ఉంది అందుకనే సహనంతో ఉంటాం కాంగ్రెస్, బీజేపీలు సీమాంధ్రుల ప్రేమ చూశారు, సహనం చూశారు కాని ఇచ్చిన మాట వెనక్కితప్పితే.. సీమాంధ్రుల పోరాటపటిమ, పౌరుషం చూస్తారు సీమాంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటే.. దేశం అంతా ఇటుచూసేలా పోరాటంచేస్తారు కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఎలాంటి పద్ధతి పాటించలేదు
మీ చావు మీరు చావండి అంటూ కాంగ్రెస్ వ్యవహరించింది కాంగ్రెస్‌లానే.. బీజేపీ కూడా తక్కువేమీ చేయలేదు మన ప్రయోజనాలు కాపాడుకోవడానికి బీజేపీకి మద్దతు పలికాను ఒక ఓటుతో రెండు రాష్ట్రాలు చేస్తానని 1997లో బీజేపీ చెప్పింది. ఈ మాట కాకినాడలోనే చెప్పారు సీమాంధ్రకు ఏం చేయాలన్నదానిపై బీజేపీ ఎలాంటి కసరత్తు చేయలేకపోయింది విడిపోవడంవల్ల ఏపీకి నాణ్యమైన విద్యా సంస్థలు లేవు గత రెండు ఏళ్లుగా నేను చెప్తునూ ఉన్నా గెలుపొందిన ఎంపీలు, సీఎం, ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసిన తప్పులే వీరు చేస్తున్నారు మేడం ప్లీజ్ మేడం… అంటూ కాంగ్రెస్ ఎంపీలు అడిగేవారు ఇప్పుడున్న ఎంపీలు ప్లీజ్..సర్… స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అంటున్నారు ఏనుగుమీద వర్షం పడినట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది రోడ్లుమీదకు వచ్చి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి తేవొద్దని మొన్న ఏప్రిల్‌లో ట్వీట్ చేశాను కాని ఈరోజున జనసేన పార్టీ స్పెసల్ స్టేటస్ డిమాండ్.. కేంద్రానికి వినిపించేలా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నా మూడు దశలుగా ప్రత్యేక హోదా పోరాటం కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో ప్రత్యేక హోదాకోసం పోరాటం చేస్తాను
బీజేపీ ఎందుకు నిలబడ్డం లేదని ఇప్పుడు ప్రశ్నిస్తా ప్రశ్నించడమే కాదు.. పోరాటం చేస్తాం కంఠంమీద కత్తి ఉండే పరిస్థితి, కాలు ముందుకు వేయాలో కాని వెనక్కి వేయకూడదు అందుకనే.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటా నోటికి ఏదిచ్చినట్టు అదిమాట్లాడితే.. సస్పైండై ఇంట్లో కూర్చోవాల్సి ఉంటుంది మాటను ఆచితూచి ఒక క్రమబద్ధంలో మాట్లాడ్డమే వర్తమాన రాజకీయాలకు అవసరం చేతగాక కాదు, పౌరుషం లేక కాదు మొదటి దశలో మనకు జరిగిన అన్యాయంపై ప్రతి జిల్లాకు వెళ్లి మీటింగులు పెడతాను మనకు జరిగిన అవమానాన్ని, నష్టాన్ని అందరి ముందు పెడతాను రెండో దశలో… కాకినాడలో మీటింగు పెడతాను ఎక్కడైతే రాష్ట్రాన్ని విభజించాలని బీజేపీ నిర్ణయం తీసుకుందో అక్కడే సమావేశం పెడతాను అప్పటికే కుదరకపోతే ఎంపీలు పోరాటం చేసేలా ఒత్తిడితెస్తాం అప్పటికీ పోరాటం చేయలేని పక్షంలో మీ అందరి సహకారంతో అందరి ఆలోచనలు, అనుమతి తీసుకుని ఉద్యమాలు చేస్తాం. అందుకే నేను ఇంతకాలం తీసుకున్నా బీజేపీతో కలిసి పోటీచేసే ఉద్దేశం నాకు లేదు నాకు అలాంటి ఇంట్రెస్టుకూడా లేదు ప్రజలకు న్యాయం జరగనప్పుడు ఎక్కడ ఉంటే.. ఆనందం వస్తుంది ప్రధాని ఈరాష్ట్రానికి అండగా ఉంటానన్నారు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. పరిశ్రమలు ఎలా వస్తాయి?: ప్రధాని మోదీకి పవన్ ప్రశ్న ప్రధానమంత్రితో నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు ప్రజలద్వారా పోరాటంచేస్తేనే పరిష్కారం వస్తుంది వ్యక్తిగతంగా బంధం ఉంటే ఒరిగేదేమీ లేదు.
ముందు ముందు జరిగే సభల్లో టీడీపీకి సూచనలు చేస్తా రెండున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు నేను చెప్పేది సూచనగానే తీసుకోండి, బాధపడి గింజుకోవద్దు తెలుగుదేశంపార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతోంది రాష్ట్రం విడిపోయింది, అప్పుల పాలయ్యాం అని సీఎం చెప్తున్నారు కేంద్రంతో గొడవపడితే రాష్ట్రానికి నిధులు రావంటున్నారు నేను అర్థంచేసుకోగలను
కాని పదేపదే ఆత్మగౌరవాన్ని మంటగలుపుతూ మన ఎంపీలు సార్.. సార్.. అని తాకట్టు పెట్డడం సరైనదేనా?: అరుణ్‌జైట్లీ, వెంకయ్య మాట్లాడుతున్నప్పుడు విసుగు, అసహనం వస్తున్నాయి ఐదేళ్లు కాదు పదేళ్లు స్పెషల్ స్టేటస్ ఇస్తామని నిలబడ్డ వ్యక్తే… స్పెషల్ స్టేటస్‌తో పనేముంది, దీంతో ఒరిగేదేముందని మాట్లాడుతున్నారు వెంకయ్యనాయుడు తప్పు చేస్తున్నారు అలా మాట్లాడొద్దు, దయచేసి అర్థంచేసుకోవాలి వెంకయ్య రాజకీయ అనుభవం ఉన్నంత వయస్సు నాకులేదని తెలుసు వెంకయ్యనాయుడు పోరాడాలి, ఆయన ముందు తెలుగువారు పార్టీ ప్రయోజనాలు కంటే ప్రజల ప్రయోజనాలు ముఖ్యం పార్టీ ప్రయోజనాలకోసం జాతి ప్రయోజనాలను వెనక్కి నెట్టరాదు మేం అడుక్కునేవాళ్లంకాదు, ప్రత్యేక హోదా మా హక్కు మాటల గారడీ, అంకెల గారడీ కాదు గోవులరక్షణ అంటూ మిగతా సమస్యలను బీజేపీ పక్కదోవ పట్టిస్తోంది ప్రత్యేక హోదా లాంటి ఏపీ సమస్యలుగాని, హైకోర్టు విభజన లాంటి తెలంగాణ సమస్యలను వదిలి…
మిగతా అంశాలపట్ల దృష్టిపెడుతున్నారు గోసంరక్షణే చేయాలంటే.. ప్రతి బీజేపీ కార్యకర్తా.. ఒక ఆవును పెంచుకుంటే సరిపోతుంది కార్పొరేట్ గో సంరక్షణా బాధ్యత తీసుకురండి కాని, దీంతోనే రాజకీయాలు చేయొద్దు అన్నిపార్టీలూ ఒకే మాటమీద నిలబడాలిమీతో కలిసిరమ్మంటే.. నేను ముందుకు వస్తాను టీడీపీ, వైఎస్సార్‌సీపీ రాజకీయల లబ్ధికి నేను అడ్డురాను ప్రజలకు న్యాయంచేయలేనప్పుడు నేను పోరాటం చేస్తాను ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాలి ప్రత్యేక హోదా గురించి అడిగితే మూడురాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపుతున్నారని చెప్తున్నారు తెంగాణ ఇచ్చేటప్పుడు ఆరుకోట్లమంది అడ్డుపడ్డా ఇచ్చారు కదా? మోదీగారంటే అభిమానం గౌరవం ఉంది కాని సీమాంధ్రప్రజలను తాకట్టుపెట్టే గౌరవం లేదు కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు అంటారు నిజమే.. కేంద్ర ప్రభుత్వం అంటే.. భయంకరమైన బ్రహ్మరాక్షసి కాదు గదా? మనుషులే కదా? మీలాగ, నాలాగ మనుషులే కదా? మీకు లొసుగులు లేకపోతే.. పోరాటం చేయడానికి భయం ఎందుకు? సీబీఐ విచారణకు ఆదేశిస్తారని అంటున్నారు.. అంటే మీకు లొసుగులు ఉన్నాయా? మీకేమైనా దాచుకోడానికి ఉన్నాయా? మరెందుకు భయపడుతున్నారు పార్లమెంటును స్తంభింపచేయండి అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలకు సిగ్గు, లజ్జ, పౌరుషం లేదా? బానిసల్లా వ్యవహరించారు ఇప్పుడు టీడీపీ, బీజేపీ ఎంపీలుకూడా గులాంగిరీ చేయకండి తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకండి పౌరుషం ఉంటే అశోక్‌గజపతిరాజు రాజీ నామా చేయాలి తుమ్మితే ఊడిపోయే పదవికోసం ఎందుకు పట్టుకుని వేలాడుతారు అలెగ్జాండర్ కూడా ఒట్టిచేతులతో వెళ్లిపోయాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపడితే అంతకన్నా పెద్ద పదవులు లభిస్తాయి నరేంద్రమోదీగారు తల్లిని చంపి.. బిడ్డను బ్రతికించారు తెలంగాణకు తల్లి ఎలాగూ చనిపోయింది కదా? నేతచీర ఎందుకు, పట్టుచీర ఎందుకు.. శవాన్నికూడా కాల్చేయండన్నట్టుగా మోదీగారి తీరు ఉంది సెప్టెంబరు 9న కాకినాడలో సభ ఇకమీదట సినిమాలు చేస్తా, ఎందుకంటే నాకు డబ్బులు లేవు సర్దార్ సరిగ్గా చూడకపోవడంతో నాకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి సినిమాలు చేస్తాను, సినిమాలతోపాటు రాజకీయాలూ చేస్తాను సామాజిక మార్పులు జరిగి ప్రజలు సంతోషంగా ఉంటే చాలు.