అబ్బాయి ఫంక్షన్ కి బాబాయి చీఫ్ గెస్ట్!!!

టాలీవుడ్ లో టాప్ ఫ్యామిలీస్ లో మెగా ఫ్యామిలీ ఒకటి అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. అయితే అదే క్రమంలో ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోలు వరుసగా హిట్స్ ఇచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీకి అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్ రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ మధ్య కొన్ని రాజకీయ కారణాల వల్లనో, లేక వ్యక్తిగత కారణాల వల్లనో కొన్ని ఇబ్బందులు వచ్చాయి.

అదే క్రమంలో మేమంతా ఒక్కటే అని మెగా ఫ్యామిలీ కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ విభేదాలు ఇంకా అక్కడక్కడ బయట పడుతూనే ఉన్నాయి. ఇక ఆ విభేధాలకు ఎలా అయినా ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకున్నాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజ. ఇంతకీ విషయం ఏమిటంటే….టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చేస్తున్న చిత్రం ‘ధృవ’. తమిళ చిత్రం తని ఒరువన్ కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఫర్స్ట్ లుక్ ని రానున్న ఆగష్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు చెర్రీ. ఇక, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న ధృవ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక, ధృవ ఆడియో వేడుకని సెప్టెంబర్ 2 పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున నిర్వహించేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు పోతున్నాడు. అంతేకాదు.. ధృవ ఆడియోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మన హీరో గారు. స్వయంగా రాంచరణ్, బాబాయ్ పవన్ ఆడియో వేడుకకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి…మరి అసలే బ్రదర్స్ మధ్య కాస్త ఎడబాటు ఉండడంతో మన పవర్ స్టార్ ఈ వేడుకకి వస్తాడో రాడో…చూడాలి మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus