Jalsa Movie: యూకే లో విడుదల కానున్న జల్సా.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు వారి పుట్టినరోజులకు రీ రిలీజ్ కావడం ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు పోకిరి సినిమాని విడుదల చేయగా పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాని 4k క్వాలిటీతో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే ఈ సినిమాని విడుదల చేసి మూడు రోజుల పాటు ప్రదర్శించారు. ఇలా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా

పలు థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదల అయ్యి భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ఏకంగా మూడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసినప్పటికీ యూకేలో మాత్రం సెప్టెంబర్ రెండవ తేదీ ఈ సినిమాను విడుదల చేయడానికి వీలు కాలేదు.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ రెండవ తేదీ విడుదల చేయడానికి వీలు కాకపోవడంతో ఈ సినిమాని సెప్టెంబర్ 8వ తేదీ తిరిగి థియేటర్లలో 4కె క్వాలిటీతో విడుదల చేసినట్టు తెలుస్తోంది.ఇలా జల్సా సినిమా మరోసారి విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు. అయితే యూకే లో ఈ సినిమాకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఈ సినిమా రీ రిలీజ్ కావడంతో థియేటర్లు మొత్తం దద్దరిల్లిపోయాయని చెప్పాలి.

ఇక పలుచోట్ల ప్రేక్షకులు అత్యుత్సాహంతో థియేటర్లను ధ్వంసం చేసిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందంటే అభిమానులకు ఓ పండుగ వాతావరణంలా ఉంటుంది. అయితే మితిమీరిన అభిమానంతో ఫాన్స్ చేసే రచ్చ కారణంగా కొన్నిచోట్ల భారీ నష్టాలు కూడా ఏర్పడుతుంటాయి.ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు అభిమానులను హెచ్చరించిన అభిమానులు మాత్రం తగ్గేదేలే అంటూ తమ హీరో పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus