కాటమ రాయుడు సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవర్ స్టార్

ట్రెండ్ ని సెట్ చేసే హీరో పవన్ కళ్యాణ్. సినిమాల్లో అయన ధరించే టీ-షర్ట్స్, జీన్స్ కి ఎనలేని డిమాండ్ ఉంటుంది. అందుకే పవర్ స్టార్ యూత్ ఐకాన్ అయ్యారు. అతను ఇప్పుడు మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. తెల్ల పంచె, తెల్ల షర్ట్ తో యువతను ఆకట్టుకోనున్నారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న కాటమ రాయుడు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్షనిస్ట్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రం రెండో షెడ్యూల్ గతవారం సికింద్రాబాద్ లో మొదలయింది. నేటి నుంచి పవన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రంలోని లుక్ తో ఉన్న ఫోటో నేడు సోషల్ మీడియాలో షేర్లు అందుకుంటోంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నారు. శృతిహాసన్, యామిని భాస్కర్ తో పవన్ ప్రేమలో పడనున్నారు.  త‌మిళంలో అజిత్ హీరోగా వ‌చ్చిన “వీర‌మ్” సినిమాకు రీమేక్ గా వస్తున్న కాటమ రాయుడు కి అనూప్ రూబెన్స్ సంగీత మందిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఫిల్మ్ ని వేగంగా పూర్తి చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది.

https://www.youtube.com/watch?v=EG1p_PS9LPo

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus