త్వరలో ఎలక్షన్స్ లో పోటీ చేయడంతోపాటు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుగా తన నివాసాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పరుచుకోనున్నాడు. నిన్నటివరకూ హైద్రాబాద్ లో ఉంటూనే అన్నీ పనులు చక్కబెట్టిన పవన్ కళ్యాణ్.. ఇవాళ ఉదయం గుంటూరులో తన ఇంటికి భూమి పూజ నిర్వహించారు. త్వరలోనే అదే ఊర్లో సెటిల్ అయ్యి అక్కడ్నుంచే జనసేన కార్యకలాపాలు జరిగేలా ప్లాన్ చేస్తున్నాడు పవన్. అలాగే.. గుంటూరులోనే ఓటర్ కార్డ్ కూడా అప్లై చేస్తాడట. ఇకపోతే.. భూమి పూజ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. “నాకు చాలా స్పష్టత ఉంది… నా అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోను… సమస్యల నుంచి పారిపోను, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, బీజేపీ, టీడీపీతో అనుసరించాల్సిన విధానంపై ఈ నెల 14న క్లారిటీ ఇస్తా, నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదు… కానీ, ఎవరినీ వెనుకేసుకురాను,
ఇంటితో పాటు పార్టీ కార్యాలయాన్ని నిర్మించే యోచనలో ఉన్నా, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇది ఉపయోపడుతుంది, మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్‌గా పనిచేశారు… మా నాన్న పనిచేసిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం సంతోషంగా ఉంది, జనసేన పార్టీపై ప్రజలకు మరింత నమ్మకం ఉంది.దాన్ని నిలబెట్టుకోవాలి, అభిమానులు ముందుకొచ్చి మంచి స్థలం చూపించారు, నా ఆస్తులు ప్రజలు ప్రేమతో ఇచ్చినవి. నేను రెండు దశాబ్దాలు కష్టపడి సంపాదించినది, ఉగాది వరకు ఇక్కడే ఉంటాను, మిగిలిన స్థలం అంతా పార్టీ కార్యాలయ నిర్మాణము మరియు విశాలమైన పార్కింగ్ కు, ప్రతీ ఒక్క సామాన్యుడు నన్ను వచ్చి కలవడానికే ఈ కార్యాలయం. ఆటోలో వచ్చి అయినా సరే నన్ను కలుసుకుకోవడానికే ఈ స్థలాన్ని ఎన్నుకున్నాను” అన్నారు.