సొసైటీకి మెసేజ్ ఇవ్వాలనే తాపత్రయం పవన్ కల్యాణ్ ప్రతి సినిమాలోనూ కనబడుతుంది. సినిమాలో కుదరకపోతే కనీసం పాటలోనైనా పవర్ స్టార్ మెసేజ్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వెళ్ళిన తరవాత సినిమాలకు కొంత విరామం ఇచ్చిన పవన్, మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. తన దగ్గరకు వచ్చే దర్శకులకు ఓ కండిషన్ పెడుతున్నారట. కథలో తప్పకుండా మెసేజ్ వుండేలా చూడమని అంటున్నారట. రీ ఎంట్రీలో పవన్ కల్యాణ్ నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అందులో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకువెళ్లారు. బాలీవుడ్ మూవీ ‘పింక్’కి ‘వకీల్ సాబ్’ రీమేక్ కాగా, క్రిష్ డైరెక్షన్ చేస్తున్న సినిమా ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కుతోంది. రెండూ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే. ఆల్రెడీ ‘గబ్బర్ సింగ్’తో హిట్ కొట్టిన హరీష్ శంకర్, పవన్ తో మరో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. పవర్ స్టార్ బర్త్ డేకి కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అప్పుడు సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ కూడా వుంటుందని హింట్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ కోసం డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రైటర్ వక్కంతం వంశీ కూడా ఎంటర్టైన్మెంట్, మెసేజ్ మిక్స్ చేసిన స్టోరీ రెడీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి టైమ్ పడుతుంది. అప్పటికి కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేస్తారట. పవన్ ఇమేజ్, ప్రజెంట్ సొసైటీ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని స్టోరీ రెడీ చేస్తున్నారట. సినిమాలో పాలిటిక్స్ ప్రస్తావన వుండనప్పటికీ… సొసైటీని ఉద్దేశిస్తూ డైలాగులు వుండొచ్చట.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!