పవన్ కనిపించలేదు!
- March 30, 2016 / 01:42 PM ISTByFilmy Focus
శ్రీజ పెళ్లిని బెంగళూరులో ఘనంగా జరిపారు మెగా కుటుంబ సభ్యులు. చిరు కుటుంబమంతా సంగీత్, మెహందీలలో సందడి చేసింది. చిరు సైతం తన డాన్సులతో, ఆట పాటలతో అందరినీ అలరించాడు. కానీ ఒక్కటే లోటు.. ఈ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ కనిపించలేదు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల శ్రీజ పెళ్లికి రాలేకపోతున్నానని పవన్ చిరుకి ముందే చెప్పేశాడట. అయితే హైదరాబాద్‌లో ఈనెల 31న జరిగే రిసెప్షన్‌కి తప్పకుండా హాజరవుతానని పవన్ మాట ఇచ్చాడట. కానీ పవన్ ఇప్పుడు ఆ కార్యక్రమానికి కూడా రాలేకపోతున్నాడని టాక్. ‘సర్దార్’ పాటల చిత్రీకరణ జరుగుతుండడంతో శ్రీజ రిసప్షన్ కు పవన్ రావడం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















