ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో ఆల్మోస్ట్ అందరూ రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరి చాలా కాలం అయ్యింది. ఒక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తప్ప. ప్రభాస్ (Prabhas) సినిమాలు ఈజీగా రూ.100 కోట్ల షేర్ మార్క్ ను దాటేస్తాయి. మహేష్ (Mahesh Babu) ఖాతాలో కూడా 4 రూ.100 కోట్ల షేర్ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి (Chiranjeevi) ఖాతాలో కూడా 3 రూ.100 కోట్ల షేర్ సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ (Jr NTR) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ‘దేవర’ (Devara) సినిమాలతో రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరాడు.
చరణ్ (Ram Charan) ఖాతాలో కూడా 2 రూ.100 కోట్ల షేర్ సినిమాలు ఉన్నాయి. ఎటొచ్చి పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా రూ.100 కోట్ల షేర్ మూవీ లేదు. పొలిటికల్ గా పవన్ బిజీగా ఉండటంతో సినిమాలపై అతను పెద్దగా ఫోకస్ పెట్టలేదు. మరోపక్క అప్పటి అధికార ప్రభుత్వం కూడా పవన్ సినిమాలకి టికెట్ రేట్లు తగ్గించేసి.. కలెక్షన్స్ పై దెబ్బ కొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ కి రూ.100 షేర్ క్లబ్లో చేరే అవకాశం పుష్కలంగా ఉంది. అతని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా జూన్ 12న విడుదల కానుంది. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తర్వాత స్టార్ హీరోల నుండి ఎటువంటి సినిమా రాలేదు. ఓ పెద్ద సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది కాబట్టి.. కచ్చితంగా ‘హరిహర వీరమల్లు’ కి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశం పవన్ సినిమాకి ఉంది. ఆయనే డిప్యూటీ సీఎం కూడా. సో ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ఆయన స్లోగన్ లో దూసుకుపోవచ్చు. కాకపోతే ఒక్కటే సమస్య. ‘హరిహర వీరమల్లు’ పై బజ్ లేదు. కాబట్టి.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. పవన్ కి రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరే అవకాశం ఉంటుంది. లేదు అంటే ‘ఓజి’ (OG Movie) వచ్చే వరకు ఆగాల్సి వస్తుంది.