‘పవన్’ను వెంటాడుతున్న ‘స్పైడర్’ సెంటిమెంట్!!

  • October 1, 2017 / 10:00 AM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ఈ హీరో గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తరగదు…అయితే పవన్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు…పొలిటికల్ స్టార్ కూడానూ…జనసేన అంటూ ప్రజల్లోకి దూసుకెళ్లే విధంగా పవన్ ఆలోచన చేస్తున్నాడు…అయితే దసరా రేస్ ముగియడంతో, అదే క్రమంలో దీపావళి రేస్ లో పెద్దగా బారీ అంచనాలతో కూడిన సినిమాలు ఏమీ లేకపోవడంతో అందరి దృష్టి ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి పై పడింది…అయితే అదే క్రమంలో సంక్రాంతి రేస్ పవన్ బాలకృష్ణ సినిమాల మధ్య వార్ గా మారబోతోంది అని వార్తలు వస్తున్నా ఈ రేస్ లో మరికొన్ని సినిమాలు చేరే ఆస్కారం ఉంది అని చెప్పక తప్పదు…అదే క్రమంలో పవన్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి…ఇక దీనికితోడు ఈ సినిమా పై పవన్ అభిమానులు కూడ చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ కధ అంతా ఒక వైపు..ఇంకో వైపు…ఈ సినిమా పై భారీ ఆశలు పవన్ అభిమానులు పెట్టుకున్నా లోలోపల మాత్రం వారిని మహేష్ ‘స్పైడర్’ సెంటిమెంట్ వెంటాడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి.

అదేలా అంటే…‘స్పైడర్’ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో ప్రిన్స్ అభిమానులు ఎంతగా నిరీక్షించారో అందరికీ తెలిసిందే. ప్రతి పండగ రావడం ఇదిగో ఫస్ట్ లుక్ అదిగో ఫస్ట్ లుక్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేయడం గతేడాది కాలంగా  జరిగింది. అలా అనేక  వాయిదాలు వేసుకుంటూ వేసుకుంటూ ఎట్టకేలకు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా  ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ప్రస్తుతం  పవన్ త్రివిక్రమ్ ల సినిమా పరిస్థితి కూడ ఇలాగే ఉంది అని పవన్ అభిఆనుల అభిప్రాయం.  పవర్ స్టార్ పుట్టినరోజున ఓ కుర్చీ తిప్పే సీన్ ను మాత్రం అభిమానులకు  చూపించిన త్రివిక్రమ్ విజయదశమిరోజున టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తాడు అని ఆశించారు. అయితే దసరా  పండగ వచ్చి వెళ్ళిపోయింది కాని  ఫ్యాన్స్ ఆశించిన ‘ఫస్ట్ లుక్’ జాడ లేదు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ టీజర్ వ్యహారం విజయదశమి నుండి దీపావళికి పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే కనీసం దీపావళికైనా ఈ  సందడి ఉంటుందా లేదా  అన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది. ఇక ఏ సెంటిమెంట్స్ అక్కడితో ఆగకుండా…గత ఏడాది దీపావళికి విడుదల చేసిన ‘కాటమరాయుడు’ ఫస్ట్ లుక్ ఫలితం ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పవన్ కి కలిసిరాని దీపావళి రోజున  పవన్ లేటెస్ట్ ఫిలిం  ఫస్ట్ లుక్ తీసుకురావడం చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉన్నారు ఫ్యాన్స్…మరి దీనిపై త్రివిక్రమ్ ఏమైనా ఆలోచన చేస్తాడో? లేక ఈ సెంటిమెంట్స్ కి తావు లేకుండా ఫర్స్ట్ లుక్ ను అందిస్తాడో చూడాలి…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus