పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుండగా పవన్ సినిమాల విషయంలో ఒకింత కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. పవన్ సుజీత్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా పవన్ సముద్రఖని కాంబినేషన్ లో వినోదాయ సిత్తం రీమేక్ తెరకెక్కాల్సి ఉంది. ఈ రెండు సినిమాలకు పవన్ కేవలం 55 రోజుల డేట్స్ కేటాయిస్తే చాలని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ఒకవైపు హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తూనే మరోవైపు వినోదాయ సిత్తం రీమేక్ లో నటిస్తారని తెలుస్తోంది.
ఈ ఏడాదే ఈ మూడు సినిమాల షూటింగ్ లు పూర్తి కానున్నాయని సమాచారం. ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రెండు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేస్తానని కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారు. ఈ ఏడాదే పవన్ నటించిన రెండు సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాలు పూర్తైన తర్వాతే పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీ తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.
సినిమా సినిమాకు పవన్ మార్కెట్ పెరుగుతుండగా పవన్ తో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై పవన్ ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. అయితే పవన్ తన సినిమాలు వీలైనంత వేగంగా షూట్ ను పూర్తి చేసుకోవాలని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని భావిస్తున్నారు. కెరీర్ విషయంలో పవన్ తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీఎంట్రీలో ప్రతి సినిమా సక్సెస్ సాధించే దిశగా పవన్ అడుగులు పడుతున్నాయి. పవన్ మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.