Pawan Kalyan: చిరంజీవి బాటలో నడుస్తున్న పవన్.. అక్కడ పోటీ చేస్తే విజయం తథ్యమేనా?

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసినా షాకింగ్ ఫలితాలు ఎదురయ్యాయి. గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కు వైసీపీ నుంచి షాక్ తగిలింది. అయితే 2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని పవన్ భావిస్తున్నారు. పవన్ ఈ ఎన్నికల్లో కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ఆ రెండు నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గం తిరుపతి అని సమాచారం అందుతోంది.

చిరంజీవి గతంలో తిరుపతి నుంచి పోటీ చేసి సక్సెస్ సాధించడం జరిగింది. తిరుపతి నుంచి పోటీ చేస్తే పవన్ కు విజయం తథ్యమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లానింగ్ కూడా వేరే లెవెల్ లో ఉందని సమాచారం అందుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేక ఫలితాలు రాకుండా పవన్ అడుగులు పడుతున్నాయని భోగట్టా. పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేసినా గట్టి పోటీ ఇచ్చే విధంగా వైసీపీ ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను సైతం 2024 ఎన్నికల సమయానికి పూర్తి చేయనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలు భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ గా కూడా అనుకూల ఫలితాలు రావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి (Pawan Kalyan) పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా పవన్ కళ్యాణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు దర్శకత్వం వహించే అద్భుతమైన ఛాన్స్ కోసం చాలామంది దర్శకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus