తల తెగి పడాలి కానీ.. కాలు వెనక్కి తిరగదు : కళ్యాణ్

పవన్ కల్యాణ్ గర్జించాడు….జనసేన పేరుతో ప్రభంజనం సృష్టించడానికి ప్రజల్లోకి వస్తున్నాడు. రాబోయే కాలంలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. ప్రజల్లో అందరిలో అసహనాన్ని పవన్ ముందుకు తీసుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నాడు. అప్పట్లో కొంగ్రెస్, ఇప్పుడు బీజేపీ మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న బ్రహ్మ రాక్షసులు అంటూ మరోసారి పవన్ ప్రశ్నించేడుకు సిద్దం అవుతున్నాడు. అవును పవన్ జనసేన ప్రజాసేనతో కలసి నడిచేందుకు సిద్దం అవుతుంది.

ఎలా అయినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అందించాలి అనేది పవన్ ఆలోచన, అందులో భాగంగానే మూడు దశల్లో పవన్ ప్రజల్లోకి వెళ్లేలా పక్కా స్కెచ్ వేసుకున్నాడు..మొదటి దశలో ఏ స్థానంలో అయితే బీజీపీ ఆంధ్ర ప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని మాట ఇచ్చింది అదే కాకినాడలో మొదటి సభ పెట్టి కేంద్రాన్ని నిలదీయాలి అని పవన్ ప్లాన్ చేస్తున్నాడు. అదే క్రమంలో జిల్లాల వారీగా ప్రతీ హెడ్ క్వాటర్స్ లోని సభలు నిర్వహించాలి అని, తమ సందేశాన్ని కేంద్రాన్నికి వినిపించాలి అని, అప్పటికీ పరిస్థితుల్లో మార్పు వస్తే సరే…..లేదంటే…రెండో దశగా…మన ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలపై ఒత్తిడి తెచ్చి కేంద్రంతో తేల్చుకునేలాగా ప్లాన్ చేస్తున్నాడు.

ఇక అప్పటికీ ప్రజల్లో మార్పు కనిపించకపోతే మూడోది, చివరిది అయిన తెగించే దశ….ప్రజలు రోడ్ల మీదకు వచ్చి దర్నాలు, రాస్తా రోకోలు చేసి మరీ కేంద్రం మెడలు వంచాలి అని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇలా మొత్తానికి పవన్ కల్యాణ్ ఒక ఆయుధంగా మారి ప్రత్యేక హోదా మా హక్కు అంటూ ప్రజల్లోకి వెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఈ పవన్ ప్రత్యేక హోదా ప్రయాణం ఎంతవరకూ సాగుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus