ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నువ్వు నా తమ్ముడివైనందుకు గర్వంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబు, రవితేజ, థమన్, వరుణ్ తేజ్, వెన్నెల కిషోర్, శ్రీనువైట్ల, బ్రహ్మాజీ, నాగవంశీ, దిల్ రాజు పవన్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్ అనే సంగతి తెలిసిందే. తొలి సినిమానే చివరి సినిమా కావాలని అనుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.
ఒక్క పోస్ట్ పెట్టకుండానే పవన్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య మిలియన్ కు పైగా చేరడం గమనార్హం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్య 2.6 మిలియన్లకు పైగా ఉంది. పవన్ అరుదుగా మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 2014 సంవత్సరంలో ఎక్కువమంది సెర్చ్ చేసిన ఇండియన్ పొలిటికల్ సెలబ్రిటీ పవన్ కావడం గమనార్హం. 2013 ఫోర్బ్స్ ఇండియా టాప్ సెలబ్రిటీలలో పవన్ 26వ స్థానంలో నిలిచారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందడం గమనార్హం. పవన్ తొలిప్రేమ జాతీయ అవార్డ్ తో పాటు వేర్వేరు విభాగాల్లో ఆరు నంది అవార్డ్ లను సొంతం చేసుకుంది. జాని, గుడుంబా శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు స్క్రిప్ట్ రాసింది పవన్ కావడం గమనార్హం. తన సినిమాలలోని కొన్నిసినిమాలకు పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
సర్దార్ గబ్బర్ సింగ్, ఛల్ మోహన రంగ సినిమాలను పవన్ నిర్మించారు. సినిమాల్లోకి రాకముందు పవన్ ప్రింటింగ్ ప్రెస్ లో, గిడ్డంగిలో పని చేశారు. తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రల్లో నటించడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు. ఫలితాల కంటే ప్రయాణం ముఖ్యమని పవన్ కళ్యాణ్ భావిస్తారు.
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?