Pawan Kalyan: క్రిస్మస్ స్పెషల్.. గిఫ్ట్స్ ఇస్తోన్న పవన్ కళ్యాణ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలు, మరోపక్క సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా భారీ షెడ్యూల్ ను పూర్తి చేశారు. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. దీంతో సినిమాలో మేజర్ పార్ట్ పూర్తయినట్లే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సన్నిహితులకు క్రిస్మస్ బహుమతులను పంపిస్తున్నారు.

ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లోని మామిడి తోటలో పండిన మామిడి పండ్లను టాలీవుడ్ లోని స్నేహితులకు, అభిమానించే వ్యక్తులకు పంపుతారనే సంగతి తెలిసిందే. అలానే ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా తన విషెస్ మెసేజ్ తో కూడిన గిఫ్ట్ పంపించడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. విషెస్ చివరన తన పేరుతో పాటు తన భార్య పేరుని కూడా మెన్షన్ చేశారు పవన్. పవన్ కళ్యాణ్ తో ఇటీవల పని చేసిన దర్శకులు కూడా ఈ బహుమతులు అందుకోగా..

అదే విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ తో ‘వకీల్ సాబ్’ సినిమా తీసిన దర్శకుడు వేణుశ్రీరామ్ పవన్ నుంచి క్రిస్మస్ కనుక అందుకున్నారు. ఈ గిఫ్ట్ ఫొటోను వేణు శ్రీరామ్ భార్య తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది. వేణు శ్రీరామ్ కి పవన్ తో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ విషయానికొస్తే.. ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమాను పూర్తి చేసేపనిలో పడ్డారు. ఆ తరువాత హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేయనున్నారు. అలానే దర్శకుడు సుజీత్ తో మరో సినిమా కమిట్ అయ్యారు. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. దీంతో పాటు ఓ తమిళ రీమేక్ కూడా లైన్ లో ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus